TANA: న్యూ జెర్సీ లో తానా కాన్ఫరెన్స్ కిక్ ఆఫ్ ఈవెంట్

శనివారం, 17 మే 2025 న, న్యూ జెర్సీ ఎడిసన్ పట్టణంలోని గోదావరి రెస్టారెంట్ లో జరిగిన 24 వ తానా కాన్ఫరెన్స్ kickboff ఈవెంట్ విజయవంతం గా జరిగింది. న్యూ జెర్సీ తానా నాయకులు శ్రీ రాజా కసుకుర్తి, శ్రీమతి లక్ష్మీ దేవినేని, శ్రీ రామ కృష్ణ నగరం లో వున్న తానా సభ్యులను, శ్రేయోభిలాషులు, MATA, TTA నాయకులను, మీడియా ను ఈ లంచ్ మీటింగ్ కి ఆహ్వానించగా, తానా ప్రెసిడెంట్ ఎలెక్ట్ డా. నరేన్ కొడాలి వాషింగ్టన్ డీసీ నుంచి, కాన్ఫరెన్స్ చైర్మన్ శ్రీ గంగాధర్ నాదెళ్ల, డైరెక్టర్ శ్రీ సునీల్ పాంత్ర, సెక్రటరీ శ్రీ కిరణ్ దుగ్గిరాల డెట్రాయిట్ నుంచి, తానా బోర్డు డైరెక్టర్ శ్రీ రవి పొట్లూరి ఫిలడెల్ఫియా నుంచి వచ్చారు.
మొదటగా తానా సెక్రెటరీ శ్రీ రాజా కసుకుర్తి, ఫౌండేషన్ సెక్రెటరీ శ్రీమతి లక్ష్మీ దేవినేని అందరికీ స్వాగతం చెప్పి తానా కాన్ఫరెన్స్ విజయవంతంగా చేయటానికి అందరి సహకారం అవసరం అని తెలిపారు.
డా. నరేన్ కొడాలి మాట్లాడుతూ అన్ని సంస్థలకు అప్పుడప్పుడు కొన్ని సమస్యలు రావడం సహజమేనని, తానా లాంటి పెద్ద వాలంటరీ సంస్థకు ఇంకా సహజమని, తానా నాయకత్వం, ఆ సమస్యను ధైర్యంగా ఎదుర్కొని, పరిష్కరించే పని లోనే ఉందని, దానితో పాటు రెండేళ్ల కొకసారి వచ్చే, అందరూ ఎదురుచూసే కాన్ఫరెన్స్ ను నిర్వహించాల్సిన బాధ్యత కూడా ఉందని, అందులో భాగం గానే మీ దగ్గరకు వచ్చి పేరు పేరునా మీ అందరి సహకారం కోరుతున్నామని తెలిపారు.
శ్రీ సునీల్ పాంత్ర మాట్లాడుతూ ఎంతో మంది రాజకీయ, సినీ ప్రముఖులతో కాన్ఫరెన్స్ అందరికీ నచ్చేలా ఉంటుందని అన్నారు.
శ్రీ కిరణ్ దుగ్గిరాల మాట్లాడుతూ ఇప్పటికే డెట్రాయిట్ లో ప్రతి వీక్ ఎండ్ రోజులలో దాదాపు 200 మంది నిర్విరామంగా పని చేస్తున్నారని తెలిపారు.
శ్రీ రవి పొట్లూరి మాట్లాడుతూ, తానా కాన్ఫరెన్స్ కి అందరూ రావాలని, అందరి మద్దతు కావాలని అన్నారు.
చివరగా శ్రీ గంగాధర్ నాదెళ్ల మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా తానా లో వచ్చిన సంక్షోభం వలన, కొన్ని సంఘాలు చేసిన పొరపాట్ల వలన, అన్ని తెలుగు సంఘాల ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ఈ సమయం లోనే అందరూ తమ మద్దతు ఇచ్చి, తమ విరాళాలతో తానా మీద ఉన్న నిజమైన ప్రేమ చూపించాలని అన్నారు.
శ్రీ రాజా కసుకుర్తి 25000 డాలర్ల విరాళంతో ప్రారంభం అయి, అనేక మంది ప్రకటించిన విరాళాలతో మొత్తం విరాళాలు 105000 డాలర్లకు చేరింది. శ్రీ గంగాధర్ నాదెళ్ల మాట్లాడుతూ, న్యూ జెర్సీ చాలా పెద్ద ఏరియా అని, అనేక మంది పెద్ద వాళ్ళు ఉన్నారని, రాజా కసుకుర్తి 200000 డాలర్ల టార్గెట్ తీసుకున్నాడని, అది సాధిస్తాడని అన్నారు.
ప్రకటించిన విరాళాలు..
Raja Kasujurthi. 25k
Lakshmi Devineni –
Swati Atluri – 5K
Rama Krishna – 5k
Radha Krishna Nalsmala – 2500
Druva – 2000
Sudhir – 2000
Srivani – 5000
Srihari mandadi – 5000
MATA – 3000
Mahendar musky – 5000
Subramanyam – 5000
Balaji veernani – 5000
Ravi kolli – 2500
Oruganti & Friends – 10000
Raviacherls – 2000
TTA Shiva
Kalyani – Balaji flowers – 5k to 10k
Brahmaji voluveti – 10k
పసందైన విందు భోజనాల మధ్య ఈ మీటింగ్ ఆహ్లాదకరం గా జరిగింది.