బే ఏరియాలో 22న తానా 5కె రన్

బే ఏరియాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో అక్టోబర్ 22వ తేదీన 5కె రన్ నిర్వహిస్తోంది. ఫ్రీమాంట్‌లోని లేక్ ఎలిజబెత్ పార్క్ ఏరియాలో ఈ కార్యక్రమం జరుగుతుందని, తానా నాయకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మన ఊరి ప్రజల సేవ కోసం ఈ కార్యక్రమాన్ని తానా ఫౌండేషన్ వివిధ చోట్ల నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇతర వివరాలకు తానా 5కె రన్ ఫ్లయర్‌ను చూడవచ్చు.