NJ: అమెరికా న్యూజర్సీ లో SPB మ్యూజిక్ అకాడమీ ఆవిర్భావ వేడుకలు

SPB మ్యూజిక్ అకాడమీ ఆవిర్భావాన్ని పురస్కరించుకుని ప్రఖ్యాత గాయకులు, పద్మవిభూషణ్ శ్రీ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారి 79వ జన్మదినాన్ని పురస్కరించుకొని, వేడుకలు జూన్ 29, 2025న న్యూజర్సీ లోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ వేదికగా ఘనంగా నిర్వహించబడ్డాయి.
సన్నాయి కళాకారుల మంగళవాద్యాలు మ్రోగుతుండగా శ్రీ SP బాలసుబ్రమణ్యం గారి చిత్ర పటాన్ని, సగౌరవంగా, భక్తి ప్రపత్తులతో ఊరేగింపుగా హాలులోకి తీసుకువచ్చి, జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు అర్పించారు. సాయిదత్త పీఠాధిపతి శ్రీ రఘు శంకరమంచి గారుపవిత్ర మంత్రోచ్చారణతో ఆశీర్వచనములు అందించారు.
ఈ సందర్భంగా సమర్పించిన నృత్య ప్రదర్శనలు అందరి మనసులు చూరగొన్నాయి.
వేదికపై 35 మంది గాయకులు శ్రీ SPB గారి చిరస్మరణీయ పాటలు ఆలపించి శ్రోతలను మైమరిపించారు. అంతేగాక, 8 మంది టీనేజ్ గాయకులు అపూర్వ ప్రతిభను చూపించి ప్రశంసలు అందుకున్నారు.
సుమారు 200 మందికి పైగా ప్రేక్షకులు హాజరై ఈ సంగీత కచ్చేరిని ఆస్వాదించారు. సంగీత కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకున్నదని, అందించబడిన విందు భోజనం ఎంతో రుచిగా ఉందని అతిథులు హర్షం వ్యక్తం చేశారు. వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి రాజేశ్వరి బుర్రతొలి పలుకు అందించి సారధ్యం వహించగా, వ్యాఖ్యాత చైతన్య మద్దూరి కార్యక్రమాన్ని అద్భుతంగా పరుగులు పెట్టించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యూజర్సీ యుటిలిటీస్ కమిషనర్ శ్రీ చివుకుల ఉపేంద్ర గారు, గౌరవ అతిథిగా TV5 మరియు మన టీవీ అధినేత శ్రీ శ్రీధర్ చిల్లర గారు హాజరై వేడుకలకు ఆకర్షణగా నిలిచారు.
అకాడమీ చైర్మన్ డాక్టర్ శ్రీ హరి ఎప్పనాపల్లి గారు, సంస్థ సలహాదారులు శ్రీ దాము గేదెల గారు, డాక్టర్ రవి అయ్యగారి గారు పాల్గొన్నారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సభ్యురాలు శ్రీమతి సుజాత వెంపరాల గారు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు శ్రీ కుమార్ రాణి గారు, శ్రీ ప్రమోద్ మసిపట్ల గారు, శ్రీమతి రమా ప్రభల గారు, శ్రీ కుమార్ బుధరాజు గారు సహకారం అందించారు.
MATA సంస్థనుండి వ్యవస్థాపకులు శ్రీనివాస్ గనగోని గారు, ప్రెసిడెంట్ శ్రీ కిరణ్ గారు, జనరల్ సెక్రటరీ శ్రీ విజయభాస్కర్ కలాల్ గారు పాల్గొన్నారు.
TFAS అధ్యక్షులు శ్రీ మధు అన్న గారు, జనరల్ సెక్రటరీ శ్రీ వెంకట తాతా గారు తదితరులు హాజరయ్యారు.
శ్రీ వాసవి సంస్థ నుండి కూడా కార్యవర్గసభ్యులు హాజరు అయ్యారు.
అకాడమీ అధ్యక్షులు శ్రీనివాస్ గూడూరు గారుమాట్లాడుతూ, “SPB గారి గాన మాధుర్యాన్ని విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం చేయడం, తద్వారా యువతకు సంగీతం, సినీ పాటలు పాడటం పట్ల ఆసక్తిని పెంపొందించడం మా లక్ష్యం,” అని తెలిపారు. వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి రాజేశ్వరి బుర్ర గారుకూడా సంస్థ లక్ష్యాలను వివరించారు.
అకాడమీ ద్వారా ప్రసిద్ధి చెందిన గాయకులు మరియు సంగీత ఉపాధ్యాయులతో వర్క్‌షాపులు, శిక్షణా కార్యక్రమాలు, ప్రతీ ఏడూ ఔత్సాహిక గాయకుల కోసం పాటల పోటీలు నిర్వహించి, SPB అవార్డ్స్అందించడం వంటి కార్యక్రమాలు చేపడతామని నిర్వాహకులు తెలియజేశారు.
సంస్థ వేడుకలకు తమ శుభాకాంక్షలు అందించిన న్యూయార్క్ లోని ఫార్మస్యూటికల్ సంస్థ అధినేత, శ్రీ పైళ్ళ మల్లారెడ్డి గారికి శ్రీనివాస్ గూడూరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
తెలంగాణ అమెరికన్ తెలుగు సంస్థ ప్రెసిడెంట్ శ్రీ నవీన్ మల్లిపెద్ది గారు, అడ్వైసరీ కౌన్సిల్ ఛైర్మన్ శ్రీ విజయపా రెడ్డి తదితరులు అభినందనలు తెలియజేశారు.
న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం అధ్యక్షులు వాణి అనుగు గారు, ఛైర్మన్ రాజేందర్ జిన్నా, వైస్ ఛైర్మన్ శ్రీ లక్ష్మణ్ అనుగు, సంస్థ దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం ఛైర్మన్ శ్రీమతి రాజీ కుంచెం, ప్రెసిడెంట్ సుమంత్ రామిశెట్టి, పూర్వాధ్యక్షులు శ్రీ పూర్ణా అట్లూరి, సంస్థ యువతకు సంగీత పరంగా ఇస్తున్న ప్రోత్సాహాన్ని అభినందించారు.
వంశీ సంస్థ అధినేత, కళాబ్రహ్మ శిరోమణి, శ్రీ వంశీ రామరాజు గారు సంస్థ కళాసేవలో మరెంతో మంది యువగాయకులు రూపొందాలని ఆకాంక్షించారు.