బే ఏరియాలో స్పందన ఫౌండేషన్ బ్యాడ్మింటన్ పోటీలు

స్పందన ఫౌండేషన్ ఆధ్వర్యంలో బే ఏరియాలో బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. సేవా కార్యక్రమాల నిధుల సేకరణలో భాగంగా ఈ పోటీలను ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. శాన్‌రామన్ చెందిన విద్యార్థులు కోటపాటి సాకేత్, పోపూరి శ్రియలు స్పందన ఫౌండేషన్ వారితో కలిసి సహ వ్యవస్థాపకులైన లంకిపల్లి గిరి సహాయంతో ఈ టోర్నమెంట్ నిర్వహించారు. ఖమ్మంకు చెందిన మానసిక వికలాంగుల ప్రాథమిక అవసరాలను తీర్చడం, డీఐజీ కేన్సర్‌పై పరిశోధన జరిపే లూసిల్ల్ పేకార్డ్, స్టాంఫోర్డ్ పరిశోధనా బందాలకు నిధులు సమకూర్చడం లక్ష్యంగా ఈ టోర్నమెంట్‌ను నిర్వహించారు. డౌహెర్టీ వేలీ హైస్కూల్ జిమ్‌లో జరిగిన ఈ టోర్నీలో 127 మంది బ్యాడ్మింటన్ అభిమానులు పాల్గొన్నారు.