Samudhra: సముద్ర రెస్టారెంట్ అండ్ లాంజ్ (న్యూజెర్సి)
మంగేష్ కె. చింతమనేని
సముద్ర (Samudhra) ప్రీమియం రెస్టారెంట్ అండ్ లాంజ్ కు వ్యవస్థాపకునిగా ఉన్న మంగేష్ కె. చింతమనేని ఐటీ కంపెనీ ఓనర్‌గా పనిచేసి ఆతిధ్యరంగంపై మక్కువతో ఈ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. సముద్ర ఇంక్ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు, సిఇఓ కూడా అయిన మంగేష్ స్వతహాగా పంటలపై పట్టు ఉన్న మనిషి. సంప్రదాయ భారతీయ ఆహారం పట్ల ఆయనకున్న ప్రేమ, న్యూజెర్సీలో ప్రామాణికమైన భారతీయ వంటకాలను ప్రదర్శించే ఒక ఉన్నత స్థాయి రెస్టారెంట్ అవసరాన్ని గుర్తించి ఈ రెస్టారెంట్‌ను ఆయన ఏర్పాటు చేశారు. విలాసవంతమైన వాతావరణంలో ఆనందంగా గడుపుతూ భోజనం చేయడంలోనే మజా ఉంటుందని ఆయన అంటూ ఇందుకు తగ్గట్టుగా తన రెస్టారెంట్ రూపుదిద్దుకుందని చెప్పారు. ఈ రెస్టారెంట్‌ను విస్తరించాలని కూడా ఆయన భావిస్తున్నారు. అమెరికాలోని ఇతర ప్రాంతాలతోపాటు కెనడా, లండన్, దుబాయ్, భారతదేశం అంతటా సముద్ర ప్రీమియం రెస్టారెంట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
న్యూజెర్సిలో ఉన్న సముద్ర ప్రీమియం రెస్టారెంట్ అండ్ లాంజ్ భారతీయ వంటకాలకు ప్రసిద్ధిగా పేరు గాంచింది. అతిథులకు పరిపూర్ణమైన ఫైన్ డైనింగ్ అనుభవాన్ని మరియు ప్రామాణికమైన భారతీయ రుచులను రూపొందించడానికి ఇక్కడి సిబ్బంది కృషి చేస్తుంటారు. 2019లో ప్రారంభమైన ఈ రెస్టారెంట్ ఎంతోమందిని ఆకట్టుకుని, వివిధ రకాల వంటకాల మెనూతో కస్టమర్లకు చేరువైంది.
సముద్ర రెస్టారెంట్లో బార్ కూడా ఉంది. మెనూలో అనేక రకాల ప్రామాణికమైన భారతీయ వంటకాలు, ముఖ్యంగా భారతీయ థాలీలు, వెజ్, నాన్ వెజ్, సీ ఫుడ్స్ వంటివి ఉన్నాయి, కాక్‌టెయిల్‌లు, విస్తృత శ్రేణి బీర్లు, స్పిరిట్లు ఫైన్ వైన్లు కూడా రెస్టారెంట్లో లభిస్తాయి. రెస్టారెంట్‌కు రావాలనుకుంటే ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే మంచిదని నిర్వాహకులు సూచలను చేస్తున్నారు. రిజర్వేషన్ చేసుకోవడం వల్ల
సరైన సమయానికి సేవలను అందించేందుకు వీలవుతుందని చెబుతున్నారు. హాయిగా అహ్లాదకరంగా భోజనం చేయాలనుకునే వ్యక్తులు ముందుగానే రిజర్వ్ చేసుకుంటే వారికి కావాల్సిన ఆహారపదార్ధాలను వెంటనే వడ్డించడానికి సులువవుతుందన్న ఉద్దేశ్యంతో ఈ రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించినట్లు నిర్వాహకులు పేర్కొంటున్నారు. అలాగే ఈ రెస్టారెంట్లో డ్రస్ కోడ్ ను అమలు చేస్తున్నారు. స్మార్ట్ క్యాజువల్ దుస్తుల కోడ్ తప్పనిసరి అని చెప్పింది. ఉన్నత ప్రమాణాలతో రెస్టారెంట్‌ను నిర్వహించాలన్న ఉద్దేశ్యంతోనే తాము డ్రెస్ కోడ్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు అంటున్నారు.







