అగ్రరాజ్యంలో రికార్డు స్థాయిలో నిరుద్యోగం
కోవిడ్ 19 అగ్రరాజ్యం అమెరికాను ఆర్థికంగా తీవ్రంగా కుంగదీసింది. 2007-2009 మధ్య కాలంలో అమెరికాను కుదిపేసిన ఆర్థిక మాంద్యం తర్వాత ఆ స్థాయిలో నిరుద్యోగం పెరిగిపోతోంది. గత నెలలో రికార్డు స్థాయిలో అత్యధికంగా 14.7 శాతానికి చేరుకుంది. ఒక ఏప్రిల్ నెలలోనే 2.05 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఫిబ్రవరి వరకు అమెరికాలో ఉపాధి అవకాశాలు బాగా ఉన్నాయి. నిరుద్యోగం రేటు 50 ఏళ్ల కనిష్టం 3.5 శాతానికి తగ్గింది. వరసగా 113 నెలల పాటు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తూనే ఉండడం కూడా ఒక రికార్డే. ఇక మార్చిలో నిరుద్యోగం 4.4 శాతంగా ఉంది. అదే ఏప్రిల్ వచ్చేసరికి 14.7 శాతానికి ఒక్కసారిగా పెరిగిపోయింది.






