పాఠశాల పిల్లలకు పద్యపఠనంపై రవికుమార్ శిక్షణ

ప్రముఖ రంగస్థల నటులు రవికుమార్ బే ఏరియాలో ఉంటున్నందున ఆయనతో పద్యాల పఠనంపై చిన్నారులకు శిక్షణ ఇప్పించాలని ‘పాఠశాల’ అనుకుంది. అందులో భాగంగా డబ్లిన్‌లో ఉన్న చిన్నారులకు రవికుమార్ పద్యాల పఠనంపై శిక్షణ ఇచ్చారు. మరిన్ని సెంటర్‌లలో కూడా పద్యాల పఠనంపై రవికుమార్ శిక్షణ ఇస్తారని పాఠశాల నిర్వాహకులు తెలిపారు.