AAA: ఎఎఎ మహాసభలకు తరలి వస్తున్న రాజకీయ నాయకులు
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) మార్చి 28,29 తేదీల్లో పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియా ఎక్స్ పో సెంటర్లో మొదటిసారిగా భారీ ఎత్తున నిర్వహిస్తున్న మహాసభలకు రాజకీయ నాయకులు తరలివస్తున్నారు. మహాసభలకు రావాల్సిందిగా ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులను స్వయంగా కలిసి కన్వెన్షన్ నాయకులు ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి ఇతర ఎమ్మెల్యేలు, మంత్రులు తదితరులను కలిసి ఆహ్వానించారు.
ఈ మహాసభలకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి అనిత వంగలపూడి, రాష్ట్ర ఆరోగ్యమంత్రి సత్యకుమార్ యాదవ్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, చిలకలూరిపేట ఎమ్మెల్యే పుల్లారావు ప్రత్తిపాటి, వినుకొండ ఎమ్మెల్యే జివిఎస్ ఆంజనేయులు, ఆముదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ కూన,ఉదయగిరి ఎమ్మెల్యే సురేష్ కాకర్ల, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, వంశీకృష్ణయాదవ్ తదితరులు ఈ మహాసభలకు వస్తున్నారు.







