Paradise: ప్యారడైజ్ బిర్యానీ పాయింట్
భారతీయులతోపాటు, అమెరికన్ల కస్టమర్లను ఆకట్టుకునే విధంగా ప్యారడైజ్ బిర్యానీ (Paradise Biryani) పాయింట్ కనిపిస్తుంటుంది. న్యూజెర్సిలోని లారెన్స్‌విల్లేలో ఉన్న ఈ రెస్టారెంట్లో భారతీయ రుచులను మీరు అస్వాధించవచ్చు. వివిధ రకాల బిర్యానీలు, హైదరాబాదీ స్పెషల్ బిర్యానీ, రకరకాల దోసెలు, స్పైసీ స్టిర్-ఫ్రైడ్ నూడుల్స్ వంటి ఇండో-చైనీస్ వంటకాల వరకు, ‘‘చాట్’’ అని పిలువబడే వీధి ఆహార అభిమానుల మెనూ వరకు అన్నీ ఇక్కడ లభిస్తాయి. సుగంధ ద్రవ్యాలతో చేసిన వివిధ రకాల బిర్యానీల రుచులు ఇక్కడి స్పెషల్ వంటకంగా చెబుతారు. పారడైజ్ బిర్యానీ పాయింట్ తన వినియోగదారులకు భారతీయ ఆహారంలో అత్యుత్తమమైన వాటిని అందిస్తోంది. నార్త్, సౌత్ వంటకాల్లో ప్రత్యేకమైన వాటిని ఇక్కడ మీరు ఎంచుకోవచ్చు. విస్తృతమైన భారతీయ వంటకాల మెనూ చూస్తే నోరూరిస్తుంటుంది.
కస్టమర్లను పారడైజ్ బిర్యానీ పాయింట్ వెజ్, నాన్ వెజ్ వంటకాలతో ఆహ్వానిస్తుంటుంది. హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాజ్ గౌలికర్ ‘ప్యారడైజ్ బిర్యానీ’ రెస్టారెంట్ ను నెలకొల్పారు. ప్యారడైజ్ బిర్యానీ పాయింట్ పలు రాష్ట్రాల్లో తమ ఫ్రాంచైజీలను నెలకొల్పింది. అన్నీ చోట్లా విజయవంతంగా రెస్టారెంట్లను నిర్వహిస్తోంది. విజిటేరియన్ వంటకాలు, నాన్ వెజిటేరియన్ వంటకాలు, సూప్‌లు, బిర్యానీలు, వెజిటేరియన్ ఎంట్రీస్, బ్రెడ్, రైస్ అండ్ నూడుల్స్, తాండూరి, ఎగ్, సౌత్ ఇండియన్ స్పెషల్స్, డెజర్ట్స్, బేవరెజ్స్ ఇలా ఎన్నో వెరైటీలు ఈ రెస్టారెంట్లో లభిస్తాయి. మోస్ట్ పాపులర్‌గా చికెన్ బిర్యానీ, చెట్టినాడ్ చికెన్, పనీర్ టిక్కా మసాలా వంటివి ఉన్నాయి.
www.paradisebiryanilawrencevillenj.com







