బే ఏరియాలో ఘనంగా పాఠశాల వసంతోత్సవం

బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా), తెలుగు టైమ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘పాఠశాల’ వసంతోత్సవ వేడుకలు మే 11వ తేదీన శాన్‌రామన్‌లోని ఐరన్ హార్స్ మిడిల్ స్కూల్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు దాదాపు 500 మందికి పైగా అతిధులు, పాఠశాల విద్యార్థులు, తల్లితండ్రులు హాజరయ్యారు. ఐదుగంటల పాటు ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పాటలు, పద్యాలు, నాటికలు, డ్యాన్స్‌లు తదితర కార్యక్రమాలను ప్రదర్శించారు. వేడుకలు జరిగిన ప్రాంతాన్ని అందంగా అలంకరించారు. స్వాగత్ ఇండియన్ కుజిన్‌వారు వచ్చినవారందరికీ భోజనాన్ని వడ్డించారు.
ఈ వేడుకల్లో తానా-పాఠశాల నిర్వహిస్తున్న తెలుగు పోటీలు కూడా జరిగాయి. ఈ పోటీల్లో 40 మందికిపైగా చిన్నారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో విజేతగా నిలిచినవారు వాషింగ్టన్ డీసిలో జూలై 4 నుంచి 6వ తేదీ వరకు జరిగే తానా మహాసభల వేదికపై జరిగే ఫైనల్ పోటీల్లో పాల్గొంటారు. డా. గీతామాధవి, పద్మశొంఠి, శ్రీదేవి ఎర్నేని, కళ్యాణి తదితరులు చిన్నారులకు పరీక్షలు నిర్వహించారు. విజేతలకు తానా నాయకులు సతీష్ వేమూరి, వెంకట్ కోగంటి సర్టిఫికెట్లను, ట్రోఫీని బహూకరించారు.
పాఠశాల అకడమిక్ డైరెక్టర్ డా రమేష్ కొండ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. టీచర్లు, కో ఆర్డినేటర్ల కృషి వల్ల బే ఏరియాలోని పాఠశాలలో ప్రతి సంవత్సరం 300 మందికి పైగా విద్యార్థులు చేరుతున్నారని చెప్పారు. పాఠశాల కరికులమ్ డైరెక్టర్ డా. గీతామాధవి, మాట్లాడుతూ, యుఎస్‌లోని చిన్నారుల కోసం ప్రత్యేకంగా కరికులమ్ తయారు చేయడం జరిగిందని చెప్పారు. టీచర్లు, తల్లితండ్రులు ఈ కరికులమ్‌పై అభిప్రాయాలను ఇస్తే వాటిని సమీక్షించి సరిచేస్తామని తెలిపారు. పాఠశాల అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజిస్టిక్స్ డైరెక్టర్ ప్రసాద్ మంగిన మాట్లాడుతూ, పాఠశాల ముఖ్య ఉద్దేశ్యం తెలుగు భాషను సులభంగా బోధించి నేర్పించడమేనన్నారు. తెలుగు మాట్లాడటంలో కష్టంగా కాకుండా ఇష్టంగా మాట్లాడేలా చేయడం పాఠశాల ఆశయమని తెలిపారు.
పాఠశాల వివిధ కేంద్రాల్లో చదువుకుంటున్న పిల్లలు నాటికలను, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. గుణపాఠం (శాన్‌హోసె సెంటర్), ఐకమత్యమే మహాబలం (డబ్లిన్ అడుగు చిన్నారులు), కృష్ణ వెనమాత్మ కథ (ఫ్రీమాంట్ పరుగు), చదువుకుంటే బాగుపడతాం (శాన్‌రామన్ సెంటర్), మామా తెలుగు (ఫ్రీమాంట్ సెంటర్), డబ్లిన్, ఫ్రీమాంట్ (వెలుగు) స్టూడెంట్స్ నిర్వహించిన అష్టావధానం వంటి కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి. బాటా కమిటీ సభ్యులు, వలంటీర్లు పాఠశాలకు సంబంధించి తల్లితండ్రులు అడిగిన సందేహాలు, ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. పాఠశాల రిజిస్ట్రేషన్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. పాఠశాల ఇ-లెర్నింగ్‌పై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్ కోమటి మాట్లాడుతూ, పాఠశాల విజయవంతంగా 6వసంతాలను పూర్తి చేసుకోవడం?ఆనందంగా ఉందని, ఇందుకు పాఠశాల టీచర్లు, కో ఆర్డినేటర్లు, బాటా నాయకత్వమే కారణమని ప్రశంసించారు. బాటా సలహాదారు విజయ ఆసూరి తొలుత అతిధులకు, ఇతరులకు ఘనంగా స్వాగతం పలికారు. పాఠశాల టీమ్ అంకితభావంతో చేస్తున్న కృషిని అభినందించారు.
తరువాత గ్రాడ్యుయేషన్ కార్యక్రమం సందడిగా జరిగింది. టీచర్లు, చిన్నారులు ప్రశంసాపత్రాలను అతిధుల చేతుల మీదుగా అందుకున్నారు.
బాటా వైస్ ప్రెసిడెంట్ హరినాథ్ చికోటి మాట్లాడుతూ, పాఠశాలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు బాటా ఎల్లప్పుడూ కృషి చేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా బాటా కమిటీని ఆయన అందరికీ పరిచయం చేశారు. యశ్వంత్ కుదరవల్లి (ప్రెసిడెంట్), సుమంత్ పుసులూరి (సెక్రటరి), కొండల్‌రావు (ట్రెజరర్), అరుణ్ రెడ్డి (జాయింట్ సెక్రటరీ), స్టీరింగ్ కమిటీ సభ్యులు రవి తిరువీధుల, కామేష్ మల్ల, కళ్యాణ్ కట్టమూరి, శిరీష బత్తుల, కల్చరల్ కమిటీ సభ్యులు శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారకదీప్తి, లాజిస్టిక్స్ టీమ్ సభ్యులు హరి సన్నిధి, వరుణ్‌ముక్కా తదితరులను ఆయన పరిచయం చేశారు. ఈ వేడుకలను విజయవంతం చేసినందుకు బాటా అడ్వయిజరీ బోర్డ్ సభ్యులు జయరామ్ కోమటి, విజయ ఆసూరి, వీరు ఉప్పల, ప్రసాద్ మంగిన, కరుణ్ వెలిగేటి, రమేష్ కొండ అందరినీ అభినందించారు.
బే ఏరియాలోని పాఠశాల టీచర్లు, కో ఆర్డినేటర్ల వివరాలు – డబ్లిన్‌లో సరస్వతీరావు, వందన, రజిత కె రావు, ఇష వరకుర్, శరత్ పోలవరపు, ఫ్రీమాంట్‌లో సునీత రాయపనేని, పద్మ విశ్వనాధ, లావణ్య అరుగొంద, దీపిక బిహెచ్‌ఎస్, శ్రీదేవి పసుపులేటి, రామదాసు పులి, మిల్‌పిటాస్‌లో సింధు, హరి సన్నిధి, శాన్‌హోసెలో శ్రీకాంత్ దాశరథి, మూర్తి వెంపటి, ఛాయాదేవి పొట్లూరి, శాన్‌రామన్‌లో శ్రీదేవి ఎర్నేని, కళ్యాణి చికోటి, సత్య బుర్ర, శాన్‌రామన్‌లో పద్మ శొంటి, ఉమ, సువర్ణ?జొన్నలగడ్డ, శ్రీధర్ కొడవలూరు, సురేష్ శివపురం, ధనలక్ష్మీ, ఉదయ్ ఈయుణ్ని.