బే ఏరియాలో ప్రారంభమైన ‘పాఠశాల’ తరగతులు

బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘పాఠశాల’ 2017-18 తరగతులు సెప్టెంబర్ 9వ తేదీన ప్రారంభమయ్యాయి. 5 సెంటర్‌లలో 5 లెవెల్స్‌లో నిర్వహిస్తున్న తరగతులు, 25 మంది టీచర్లు, 400 మంది విద్యార్థులతో పాఠశాల తరగతులను నిర్వహిస్తూ అందరి మన్ననలను అందుకుంటోంది.
పాఠశాల చైర్మన్ జయరామ్ కోమటి, పాఠశాల డైరెక్టర్‌లు ప్రసాద్ మంగిన, రమేష్ కొండ, బాటా నాయకులు, సెంటర్ కో ఆర్డినేటర్‌లు, టీచర్లు కొత్త సంవత్సరంలో చేరిన విద్యార్థులను ఆనందంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జయరామ్ కోమటి మాట్లాడుతూ, పాఠశాలను దిగ్విజయంగా నిర్వహిస్తున్న బాటా నాయకులకు అభినందనలు తెలుపుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో, ఎపి విద్యాశాఖ ఇచ్చిన సిలబస్‌తో కొత్త తరహాలో తెలుగు భాష బోధనను పాఠశాల చేపట్టిందని చెప్పారు. LSRW పద్ధతిలో తెలుగు భాషను చిన్నారులకు సులభంగా నేర్పిస్తారని తెలిపారు.
ప్రసాద్ మంగిన మాట్లాడుతూ, కొత్త విద్యాసంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నవాళ్ళకు అభినందనలు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు, సహకారంతో ఈ సంవత్సరం మరింత సులభంగా తెలుగు భాష బోధన ఉంటుందని చెప్పారు. దీనివల్ల సులభంగా తెలుగు భాషను నేర్చుకోవచ్చన్నారు. రమేష్ కొండ మాట్లాడుతూ, కొత్తగా చేరిన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ, టీచర్లకు అవగాహన తరగతులను సెప్టెంబర్ 15వ తేదీన ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిన్నారులతోపాటు తల్లితండ్రులు కూడా పాల్గొన్నారు.
Paatasala Admission details please visit : www.paatasala.net