తెలుగువారికి లైన్ క్లియర్
విదేశాల్లో చిక్కుకున్న తెలుగువారు తమ తమ స్వస్థలాలకు చేరుకునేందుకు లైన్ క్లియన్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అతలాకుతలం చేస్తుండటంతో వివిధ దేశాల్లో వేలమంది భారతీయులు చిక్కుకుపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయా దేశాలతో సంప్రదించి వారందరినీ స్వదేశాఇకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాలు ఫలించడంతో విదేశాల్లో చిక్కుకున్న దాదాపు 15 వేల మంది భారతీయులు వారి వారి స్వరాష్ట్రాలకు చేరుకోనున్నారు. వీరిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు 64 ప్రత్యేక విమానాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న తెలుగు వారు కూడా స్వరాష్ట్రాలకు చేరుకోనున్నారు. శుక్రవారం అర్థరాత్రి నుంచి సోమవారం నాటికల్లా ముంబయి చేరుకోనున్నారు.
అక్కడి నుంచి తెలంగాణకు సంబంధించిన వారిని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అదేవిధంగా ఆంధప్రదేశ్‌కు చెందిన వారిని గన్నవరం ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక విమానాల్లో తరలించనున్నారు. ఎయిప్పోర్టుకు చేరుకున్న వారందరిని ప్రత్యేక బస్సుల్లో పెయిడ్ క్వారంటైన్ కేంద్రాలకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధప్రదేశ్‌కు సంబంధించిన వారి కోసం ఇప్పటికే అధికార యంత్రాంగం విజయవాడ హోటళ్ళు, లాడ్జిల్లో రూమ్‌లను సిద్ధం చేసి స్వాదీనం చేసుకుంది. మొత్తం 4 కేటగిరిలుగా ఈ రూమ్‌లను సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే వృద్ధులు, గర్బీణిలు, చిన్నపిల్లలను హోం క్వారంటైన్‌కు తరలించాలని వైద్యులకు ప్రభుత్వానికి సూచించారు. క్వారంటైన్లో 14 రోజులపాటు ఉన్నంతరం కరోనా నెగిటివ్ వచ్చిన వారిని మాత్రమే వారి వారి స్వస్థలాలు, స్వగృహాలకు అనుమతించనున్నారు.






