బే ఏరియాలో తణుకు ఎమ్మెల్యేకి ఘనసన్మానం

బే ఏరియాలో పర్యటిస్తున్న తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణను బే ఏరియాలోని ఎన్నారై టీడిపి అభిమానులు ఘనంగా సన్మానించారు. జూలై 3వ తేదీన మిల్‌పిటాస్‌లో ఉన్న స్వాగత్ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్నారై టీడిపి అభిమానులు, ఇతర మిత్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణతోపాటు అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్ కోమటి కూడా ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమం కోసం చేస్తున్న కృషిని వారు వివరించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలుపుకోసం ఎన్నారై టీడిపి అభిమానులంతా కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వెంకట్ కోగంటి, రజనీకాంత్ కాకరాల, శ్రీకాంత్ దొడ్డపనేని, భాస్కర్ కొడాలి, రాజశేఖర్ వేసంగి, శ్రీని వల్లూరుపల్లి, భరత్ ముప్పిరాల, హేమరావు నందిపాటి, ప్రతాప్ వీరవల్లి, బబ్బూరి సురేష్, హరికృష్ణ నల్లమల తదితరులు పాల్గొన్నారు.