NATS: డిసెంబర్ 14న ఉత్తర అమెరికా తెలుగు సంఘం బాలల సంబరాలు 2025..
ఎడిసన్, న్యూజెర్సీ: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) ఆధ్వర్యంలో తెలుగు చిన్నారుల కోసం ప్రతిష్ఠాత్మకమైన ‘బాలల సంబరాలు’ కార్యక్రమాన్ని డిసెంబర్ 14, 2025న న్యూజెర్సీలో ఘనంగా నిర్వహించనున్నారు. తెలుగు సంస్కృతిని, ఆటపాటలను ప్రోత్సహించడంతో పాటు, మేధోపరమైన పోటీలకు వేదికగా ఈ కార్యక్రమం నిలవనుంది.
ముఖ్య వివరాలు
తేదీ: డిసెంబర్ 14, 2025
సమయం: ఉదయం 10:00 నుండి సాయంత్రం 04:00 వరకు EST (ఈస్టర్న్ స్టాండర్డ్ టైమ్)
వేదిక: 145 Talmadge Rd, Suite 18, Edison NJ 08817
రిజిస్ట్రేషన్ ఫీజు: నాట్స్ సభ్యులకు ఉచితం. ఇతరులకు $10
రిజిస్ట్రేషన్ లింక్: https://natsworld.org/njbalasambarlu
ఈ కార్యక్రమంలో పిల్లల వయస్సును బట్టి వివిధ విభాగాలలో ఆసక్తికరమైన పోటీలు నిర్వహిస్తారు:
మాథ్ ఛాలెంజ్ (Math Challenge):
ఎంట్రీ లెవెల్ (గ్రేడ్స్ 2 – 4)
మిడ్ లెవెల్ (గ్రేడ్స్ 5 – 8)
అడ్వాన్స్డ్ లెవెల్ (గ్రేడ్స్ 9 – 12)
చెస్ (USCF టోర్నమెంట్ డైరెక్టర్స్ ఆధ్వర్యంలో):
U400 (గ్రేడ్స్ K–3)
U600 (గ్రేడ్స్ K–12)
U900 (గ్రేడ్స్ K–12)
ఓపెన్ (గ్రేడ్స్ K–12)
కారమ్స్ (Carroms):
ఎంట్రీ లెవెల్ (వయస్సు 7 – 9)
మిడ్ లెవెల్ (వయస్సు 10 – 13)
అడ్వాన్స్డ్ లెవెల్ (వయస్సు 9 – 12)
మరిన్ని వివరాలకు…
బిందు యలమంచిలి: 908-240-3167
సురేంద్ర పోలేపల్లి: 510-458-1980
అనుజ వెజళ్ల: 908-398-0233
- Vishal.B






