TANA: తానా అవార్డ్స్ ఫర్ ఎక్స్‌లెన్స్ – నామినేషన్ల కోసం పిలుపు
ఉత్తర అమెరికా తెలుగుసంఘం (TANA) 24వ మహాసభలను పురస్కరించుకుని వివిధ కార్యక్రమాలను, వివిధ పోటీలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కమ్యూనిటీకి వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులను తానా ఎక్స్‌లెన్స్ అవార్డులతో సత్కరించాలని భావిస్తోంది. ఇందుకోసం దరఖాస్తులను ఆహ్వనిస్తున్నట్లు తానా కాన్ఫరెన్స్ కమిటీ ఒక ప్రకటనను విడుదల చేసింది.
విద్య, క్రీడలు, సాహిత్యం, కళలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, వైద్యం, వ్యాపారం, ఎంట్రప్రెన్యూర్‌షిప్, రాజకీయాలు, ఇతర వృత్తులు మరియు కార్యకలాపాలు, కమ్యూనిటీ సేవ, మరియు తానా సేవ వంటి వాటితో పాటు ఇతర రంగాల్లో కూడా గుర్తింపును పొందినవారు ఈ అవార్డులకోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తానా అవార్డుల కమిటీ అవార్డ్స్ ఆఫ్ ఎక్సలెన్స్ మరియు మెరిటోరియస్ అచీవ్‌మెంట్ కోసం ఈ నామినేషన్లను అభ్యర్థిస్తోంది. ఈ అవార్డులను తానా మహాసభల్లో భాగంగా జరిగే బాంక్వెట్ వేడుకల్లో అందజేస్తారు.







