NATS: చికాగోలో దిగ్విజయంగా నాట్స్ క్రికెట్ టోర్నమెంట్

అమెరికాలోని తెలుగువారిని కలిపేలా క్రీడా పోటీలను నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) తాజాగా చికాగోలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించింది. ఈ టోర్నమెంట్‌కు తెలుగు వారి నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. 150 మందికి పైగా తెలుగు క్రికెటర్లు ఈ టోర్నమెంట్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆటగాళ్ళు తమ అసాధారణ ప్రతిభను ప్రదర్శించి క్రీడా స్ఫూర్తిని చాటారు. తెలుగు వారి మధ్య సమైక్యతకు బాటలు వేశారు. ఈ పోటీలో ఏటీఏతో పాటు ఇతర తెలుగు సంస్థలు, స్థానిక గ్రూపులకు చెందిన జట్లు పాల్గొన్నాయి.
ఘన విజయం సాధించిన జట్లు
ఈ టోర్నమెంట్‌లో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన లయన్స్ జట్టు ఛాంపియన్‌గా నిలవగా, అపోలో %శI% జట్టు రన్నరప్‌గా నిలిచింది. విజేతలు, రన్నరప్‌లకు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ప్రెసిడెంట్ శ్రీహరి మందడి అభినందనలు తెలిపారు. టోర్నమెంట్ నిర్వహణలో చికాగో టీమ్ కృషిని వారు ప్రశంసించారు. అలాగే, నాట్స్ పూర్వ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి విజేతలకు, రన్నరప్‌లకు ట్రోఫీలను అందించారు..
సమిష్టి కృషితో సాధించిన విజయం
నాట్స్ కార్యవర్గ సభ్యుడు శ్రీహరీష్ జమ్ముల, చికాగో చాప్టర్ లీడ్ వీర తక్కెళ్లపాటి చేసిన ప్రణాళిక, సమన్వయం, షెడ్యూలింగ్ ఇవన్నీ టోర్నమెంట్ విజయంలో కీలక పాత్ర పోషించాయి.. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో చికాగో చాప్టర్ టీమ్ నాయకులు నరేంద్ర కడియాల, అంజయ్య వేలూరు అద్భుతమైన సహకారాన్ని అందించారు. ఈ టోర్నమెంట్ నిర్వహణ కోసం వేదిక, రవాణా, ఆహారం వంటి వాటిని నాట్స్ చికాగో కార్యవర్గ సభ్యులు ఆర్‌కే బాలిశెట్టి, ఎమ్మాన్యూయెల్ నీల, గత కార్యవర్గ సభ్యుడు కృష్ణ నిమ్మగడ్డ, నాట్స్ బోర్డ్ మాజీ డైరెక్టర్ మూర్తి కొప్పాక, శ్రీనివాస్ అరసడ, శ్రీనివాస్ బొప్పనలకు నాట్స్ జాతీయ నాయకత్వం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఈ టోర్నమెంట్ విజయవంతం కావడానికి నిస్వార్థంగా కృషి చేసిన వాలంటీర్లు రాయుడు, గోపికృష్ణ ఉలవ, మనోహర్ పాములపాటి, నరేష్ యాద, శ్రీనివాస్ పిల్లా, రోహిత్ యలవర్తి, పృథ్వి రామిరెడ్డి, రాజేష్ వీడులమూడి, పండు చెంగల్‌శెట్టి, అరవింద్ కోగంటి, సంతోష్ పిండిలకు నాట్స్ చికాగో నాయకత్వం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.