15 నుంచి న్యూయార్క్ లో సడలింపులు
కొవిడ్ 19 కేసులు అధికంగా ఉన్న న్యూయార్క్లో మాత్రం లాక్డౌన్ ఆంక్షలు మే చివరి వరకూ లేదా జూన్ వరకూ కొనసాగుతాయని ఆ నగర మేయర్ బిల్ డె బ్లాసియో తెలిపారు. మరో వైపు ఇదే రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఈ నెల 15 నుంచి మార్కెట్లను తెరువనున్నట్టు గవర్నర్ ఆండ్య్రూ క్యూమో ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా విధించిన నిబంధనలకు మే 15 తో గడువు ముగియున్నది. దీంతో ఫింగర్ లేక్స్, సౌతర్న్, టైర్, మొహాక్వ్యాలీ ప్రాంతాల్లో ఆంక్షల్ని సడలించనున్నారు. న్యూయార్క్ రాష్ట్రంలో ఇప్పటివరకూ 3,37,055 కేసులు నమోదు కాగా, 26,000 మంది మృతి చెందారు. ఒక్క న్కూయార్క్ నగరం లోనే 1,83,662 కేసులు నమోదు కాగా, 14,928 మంది మృతి చెందారు.






