Laasya: బే ఏరియాలో లాస్య 2025 అంతర్ కళాశాలల భారతీయ శాస్త్రీయ నృత్య పోటీలు

బోస్టన్ యూనివర్సిటీ(Boston University) మరియు MIT సంస్థలు 2010లో స్థాపించిన లాస్య, దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాలలో నిర్వహించబడుతూ వస్తోంది. ఎంతో ఖ్యాతిగాంచిన ఈ లాస్య 2025 అంతర్ కళాశాల భారతీయ శాస్త్రీయ నృత్య పోటీలను శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో అత్యంత ప్రతిష్టాత్మకగా నిర్వహించే అవకాశం దక్కింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేయబడిన టీమ్‌లు జట్లు గత సంవత్సరం నుండి కొరియోగ్రాఫ్ చేసి సాధన చేసిన నృత్యాలను ఈ పోటీల్లో ప్రదర్శిస్తాయి, ఒరిజిన్స్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో స్థానం కోసం పోటీపడతాయి.
కాగా ఈ పోటీలను గతంలో వివిధ విశ్వవిద్యాలయాలను ఘనంగా నిర్వహించాయి. ఈ సంవత్సరం నృత్య పోటీలను నిర్వహించే అవకాశం బెర్క్‌లీకి లభించడం గర్వంగా ఉందని నిర్వాహకులు అంటున్నారు. ఈ సంవత్సరం యుడబ్ల్యు నాట్య, తాము సాహిత్య, జిటి పల్స్, యుటి నృత్య సంగం, యుసిఎస్‌డి పుష్పాంజలి, జూ శక్తి, ఆర్‌య నాట్య, యుఎన్‌సి ఏక్ తాల్ తో ప్రదర్శనలు జరగనున్నాయి.
ఇతర వివరాలకోసం (415) 338-2467 సంప్రదించండి లేదా support@lcabox.freshdesk.com కు ఇమెయిల్ చేయండి.