జిన్ పింగ్ కు కిమ్ అభినందనలు
చైనాలో కరోనా వైరస్ అరికట్టడంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తీసుకున్న శ్రద్ధాసక్తులను ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అభినందించారు. కరోనాపై చైనా సాధించిన విజయం ఆదర్శప్రాయమని కిమ్ ఉటంకిస్తూ ఉత్తరకొరియా అధికార వార్త సంస్థ కెసీఎన్ఏ పేర్కొంది. ఇరవై రోజులపాటు అజ్ఞాతంలో గడిపి మళ్ళీ దైనందిన కార్యకలాపాల్లో పాల్గొంటున్న కిమ్ చైనా అధ్యక్షుణ్ణి కీర్తించడం గమనార్హం. చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన కరోనా ప్రపంచ వ్యాప్తంగా 2010 పైగా దేశాల్లో రెండు లక్షల మంది పొట్టన పెట్టుకుంది. 38 లక్షల మంది ఈ వ్యాధి బాధితులుగా మారారు.






