TTA: టీటీఏ న్యూయార్క్ రీజనల్ వైస్ ప్రెసిడెంట్‌గా జయప్రకాష్ నియామకం
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) (TTA) న్యూయార్క్ ఛాప్టర్ రీజనల్ వైస్ ప్రెసిడెంట్‌గా జయప్రకాష్ ఎంజపూరి (Jayaprakash Enjapuri) నియమితులయ్యారు. ఆయనకు టీటీఏ (TTA) వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి (Dr.Pailla Malla Reddy) అభినందనలు తెలిపారు. పదహారేళ్లుగా కమ్యూనిటీ సేవలు చేస్తున్న జయప్రకాష్.. తెలుగు లిటరసీ అండ్ కల్చరల్ అసోసియేషన్ (టీఎల్‌సీఏ) 51వ ప్రెసిడెంట్‌గా కూడా సేవలందించారు. ప్రపంచంలోని ఆరు ప్రధాన మ్యారథాన్లను పూర్తిచేసిన మొట్టమొదటి తెలుగు వ్యక్తిగా, 48వ భారతీయుడిగా కూడా జయప్రకాష్ రికార్డు సృష్టించారు. అలాగే ఆయన (Jayaprakash Enjapuri) తన హయాంలో ప్రపంచవ్యాప్తంగా 18 మ్యారథాన్లను చేపట్టడం గమనార్హం. క్రీడారంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా 2022లో ‘లైఫ్‌టైం అచీవ్మెంట్ ఇన్ స్పోర్ట్స్’ అవార్డుతో ఆయన్ను టీటీఏ సత్కరించింది. న్యూజెర్సీలో జరిగిన టీటీఏ మెగా కన్వెన్షన్‌లో ఈ అవార్డును అందించారు.
ఆఫ్రికాలోని అత్యున్నత శిఖరం మౌంట్ కిలిమంజారోను 2023 సెప్టెంబరులో జయప్రకాష్ అధిరోహించారు. పెరూలోని మాచుపిచుకు వెళ్లే సల్కంటే పాస్‌ను 2024 జూన్‌లో పూర్తిచేశారు. ఈ ఏడాది సెప్టెంబరులో మౌంట్ ఎవరెస్టుపై త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించేందుకు జయప్రకాష్ (Jayaprakash Enjapuri) సిద్ధం అవుతున్నారు. ఇలాంటి అడ్వంజర్స్ చేసే జయప్రకాష్‌ను టీటీఏ రీజనల్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమించడం పట్ల టీటీఏ వ్యవస్థాపకులు, అడ్వైజరీ కౌన్సిల్, టీటీఏ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, స్టాండింగ్ కమిటీ, రీజనల్ వైస్ ప్రెసిడెంట్లు.. అందరూ హర్షం వ్యక్తం చేశారు.
టీటీఏ న్యూయార్క్ టీంలో జయప్రకాష్తోపాటు (Jayaprakash Enjapuri) సహోదర్ పెద్దిరెడ్డి (ట్రెజరర్), ఉషా రెడ్డి మన్నెం (మ్యాట్రిమోనియల్ డైరెక్టర్), రంజీత్ క్యాథమ్ (బీవోడీ), శ్రీనివాస్ గూడూరు (లిటరరీ మరియు సావనీర్ డైరెక్టర్)ల నియామకం కూడా జరిగింది. వీరు కోర్ టీం సభ్యులు మల్లిక్ రెడ్డి, రమా కుమారి వనమ, సత్య ఎన్ రెడ్డి గగ్గెనపల్లి, సునీల్ రెడ్డి గడ్డం, వాణి సింగిరికొండ, హరిచరణ్ బొబ్బిలి, సౌమ్య శ్రీ చిట్టారి, విజేందర్ బాసా, భరత్ వుమ్మన్నగారి, మౌనిక బోడిగమ్తో కలిసి కొత్త టీం సభ్యులు పనిచేస్తారు. ఈ సందర్భంగా తమకు ఎంతో మద్దతుగా నిలిచిన టీటీఏ వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి, అడ్వైజర్ కమిటీ చైర్ డాక్ర్ట విజయపాల్ రెడ్డి, కో-చైర్ డాక్టర్ మోహన్ రెడ్డి పాతాలోల్ల, సభ్యులు భరత్ రెడ్డి మాదడి, శ్రీని అనుగు, టీటీఏ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది తదితరులందరికీ టీటీఏ (TTA) న్యూయార్క్ ఛాప్టర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది.







