ఇవాంక ట్రంప్ పీఎస్ కు కరోనా పాజిటివ్
చైనా నుంచి మొదలై అమెరికాను పట్టుకొన్న కరోనా వైరస్.. ఇప్పుడు ఏకంగా వైట్‌హౌజ్ ఉద్యోగులపై కన్నేసినట్లు కనిపిస్తున్నది. నాలుగు రోజుల క్రితం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్సనల్ వాలెట్లోని ఒకరికి పాజిటివ్ నిర్ధారణ అయిన నేపథ్యంలో అందరూ వైరస్ సోకకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నారు. ట్రంప్ కుమార్తె ఇవాంకకు పర్సనల్ సెక్రటరీకి రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో ఇవాంక, ఆమె భర్త కుష్నర్ ఇద్దరు కొవిడ్ 19 పరీక్షలకు హాజరుకాగా, వారిద్దరికీ నెగెటివ్‌గా తేలింది. కరోనా పాజిటివ్‌గా తేలిన పీఎస్‌కు పాజిటివ్ రావడంతో వైట్‌హౌజ్‌లో పాజిటివ్ కేసులు సంఖ్య మూడుకు చేరుకొన్నది. ఈ నేపథ్యంలో వైట్‌హౌజ్‌లోని ఉద్యోగులు అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్న నిబంధన తీసుకొచ్చారు. విధుల్లోకి రాగానే ఉద్యోగులందరికీ వెస్ట్ వింగ్‌లో శరీర ఉష్ణోగ్రతలు నమోదు చేస్తున్నారు.






