Indian Origin Man: పెన్సిల్వేనియాలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్య

అమెరికాలోని (USA) పిట్స్‌బర్గ్‌లో భారత సంతతి (Indian Origin Man) మోటెల్ మేనేజర్ దారుణ హత్యకు గురయ్యారు. రాబిన్సన్ టౌన్‌షిప్‌లోని పిట్స్‌బర్గ్ మోటెల్‌ను నిర్వహిస్తున్న 51 ఏళ్ల రాకేష్ ఎహగబన్ (Rakesh Ehagaban).. మోటెల్ బయట జరుగుతున్న గొడవను ఆపేందుకు ప్రయాణించి దుర్మరణం పాలయ్యారు. గొడవ జరుగుతున్న శబ్దం విని బయటకు వచ్చిన రాకేష్.. తుపాకీతో ఉన్న వ్యక్తిని చూసి, సహాయం చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఆ వ్యక్తి వెంటనే తుపాకీని రాకేష్ వైపు తిప్పి సూటిగా తలపై కాల్చాడు. ఈ ఘటన మోటెల్ సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చడంతో రాకేష్ (Rakesh Ehagaban) అక్కడికక్కడే మరణించారు.
నిందితుడిని 37 ఏళ్ల స్టాన్లీ యూజీన్ వెస్ట్ అని పోలీసులు గుర్తించారు. మోటెల్ (Motel) బయట అతడు తన గర్ల్ ఫ్రెండ్ ను కూడా కాల్చి, ఆ తర్వాత కారులో పరారయ్యాడు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. పోలీసులపై కూడా అతను జరిపిన కాల్పుల్లో (Pennsylvania Shootings) ఒక అధికారి కూడా గాయపడినట్లు సమాచారం. స్టాన్లీపై క్రిమినల్ హోమిసైడ్ సహా పలు కేసులు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.