90కి పైగా దేశాలకు భారత్ సాయం
కరోనాపై పోరులో భాగంగా దాదాపు 90 దేశాలకు భారత్ రూ.110-120 కోట్ల విలువైన వైద్యసాయం అందించనుంది. డ్రగ్స్‌తో పాటు, టెస్టింగ్ కిట్స్ తదితర వైద్య పరికరాలు అందజేయనుంది. మరికొన్ని దేశాలకు మెడిసిన్స్, ఇతర వైద్య పరికరాలను అమ్మడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార వర్గాల కథనం ప్రకారం.. 67 దేశాలకు రూ.60 కోట్ల విలువైన కరోనా టెస్టింగ్ కిట్లు, డ్రగ్స్, ఇతర వైద్య సాయం అందించనుంది. ప్రధానంగా పశ్చిమాసియా దేశాలు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, జోర్డాన్ తదితర దేశాలకు ఈ వైద్య సాయం అందించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.






