MATA: ఘనంగా మాటా ఐడల్ గంధర్వ అవార్డుల పురస్కార మహోత్సవం
అమెరికాలో తెలుగు కమ్యూనిటీకి విశేష సేవలందిస్తున్న మన అమెరికా తెలుగు సంఘం (MATA) ఆధ్వర్యంలో మూడు రోజులపాటు విశాఖపట్నంలోని డాబా గార్డెన్స్ లో ఉన్న శ్రీఅల్లమా సీతారామయ్య విజ్ఞాన వేదికలో ఐడల్ గంధర్వ జాతీయ అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవం -2025 వేడుకలు వైభవంగా జరిగాయి. మూడురోజులపాటు సంగీత ప్రదర్శనలు, కళావైభవం, కళాకారుల గౌరవ సభలతో ఈ వేడుకలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 70 మందికి పైగా ప్రతిభావంతులకు గౌరవ సత్కారం చేశారు. సినిమా సంగీతం సాహిత్యం నాటకరంగం, సోషల్ సర్వీస్, ఫైన్ ఆర్ట్స్ మీడియా గ్లోబల్ కల్చరల్ ప్రమోషన్ తదితర రంగాలలో విశేష సేవలందించినవారికి పురస్కారాలను అందించారు.
నవంబర్ 27వ తేదీన భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్యసాయిబాబా 100వ వసంతోత్సవ వేడుక, 28న పద్మశ్రీ ఘంటసాలవారి 103వ వేడుక, 29న మహానటి సావిత్రి 91వ వసంతవేడుకను మాటా ఆధ్వర్యంలో నిర్వహించారు. స్వరసమ్రాట్ టి. శరత్ చంద్ర ఆధ్వర్యంలో గంధర్వగళ గీతామృతం కార్యక్రమం కూడా జరిగింది. మన అమెరికా తెలుగు సంఘం తరపున, అమెరికాలో కమ్యూనిటీ ప్రముఖులుగా ఉన్న దాము గేదెల, ప్రవీణ్ గూడూరు ఈ కార్యక్రమాలను కో ఆర్డినేట్ చేశారు. వీరితోపాటు పి. నాగేశ్వరరావు సంచాలకులు, బి.శ్రీమన్నారాయణ సంచాలకులు లక్ష్మీ నారాయణ సంచాలకులు రాంబాబు సంచాలకులు హాజరయ్యారు.
సంగీత సామ్రాట్ డా.టి.శరచ్చంద్ర సారథ్యంలో ఘంటశాల గానామృతములో భాగంగా శ్రీకృష్ణ మాయ చిత్రంలో ‘‘ జయసుందర నందన’’పాటతో సభ ప్రారంభమైంది. భక్త జయదేవ చలనచిత్రం లో 10 రాగాలుతో కూడిన ‘‘ జయ జగదీశ’’ పాడి శ్రోతలను ఆకట్టుకున్నారు. చివరిరోజున అతిథులుగా రఘూజీ (అమెరికా), పల్లి నల్లనయ్య పద్మశ్రీ ఎడ్ల గోపాలరావు హాజరయి ఈ కార్యక్రమం విశాఖపట్నం లో నిర్వహించి, వివిధ రంగాలలో సేవాలందించిన వారికీ అవార్డు లు ఇవ్వటం అభినందనీయమన్నారు. శరచ్చంద్ర కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాటా ఫౌండర్, అడ్వైజరి కౌన్సిల్ మెంబర్స్ శ్రీనివాస్ గణగొని, ప్రదీప్ సామల, ప్రెసిడెంట్ రమణ కిరణ్ దుడ్డగి, వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గూడూరు, ట్రెజర్ శ్రీధర్ గూడల, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మహేంద్ర నరాల బోర్డ్ డైరెక్టర్స్ రామ్ మోహన్ చిన్నల మల్లిక్ బొల్లా తదితరులు ఈ వేడుకల విజయవంతానికి సహకరించారు. సంచాలకులు శ్రీ రావి గోపి కృష్ణ, మస్తాన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నాంచారయ్య గారు, శ్రీ సూర్యనారాయణ గారు ఫణిశయన స్వామి గారు, డి. ఆర్. కె. రావు గారు, మద్దికాయల రాంబాబు గారు, బిట్టవరం శ్రీమన్నారాయణ గారు, నల్లా లక్ష్మినారాయణ గారు, మైస ఎర్రన్న గారు, పర్యవేక్షకులుగా ఈశ్వర్ రావు గారు, సంతోష కుమార్ గారు, యం. ఎల్. ఆర్ గారు, కందారపు రాధ గారు హాజరయ్యారు. సాగంటి మంజుల గారు, సౌమ్య గారు, ఆదయ్య మాష్టర్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.






