Delhi: పుతిన్ పర్యటన నుంచి భారత్ ఆశిస్తుందేంటి..?
ప్రస్తుతం అమెరికా టారిఫ్ ఆంక్షలతో భారత్ ఇబ్బందులు పడుతోంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు పూర్తిగా నిలిిపివేయాలని ఒత్తిడి తెస్తోంది అగ్రరాజ్యం. కాదంటే.. మరిన్ని ఆంక్షలు వేస్తామని స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖరాఖండీగా చెబుతున్నారు. మరి ఈసమయంలో భారత్ వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఎలాంటి ఒప్పందాలు చేసుకుంటున్నారు. భారత్ వాణిజ్య లోటును ఎలా పూడ్చే అవకాశం ఉంది.
చమురు కొనుగోళ్లపై..
అమెరికా ఆంక్షలను తట్టుకోవడానికి రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ చాలా వరకు తగ్గించిందని చెప్పవచ్చు.అయితే పూర్తిగా కొనుగోళ్లను భారత్ ఆపలేదు. ఎందుకంటే .. రష్యాచమురు కొనడం వల్ల భారత్ కు చాలా ప్రయోజనాలున్నాయి.ముఖ్యంగా..’భారత దిగుమతుల్లో రష్యా చమురుకు గణనీయమైన వాటా ఉంది. దానిని కొనడం ద్వారా భారతదేశం మంచి లాభాలను ఆర్జిస్తోంది. ప్రభుత్వ ఖజానాను నింపడానికి అవకాశం కల్పించే ఇలాంటి ‘ప్రాఫిటబుల్ ఆఫర్’ను ఎవరైనా ఎందుకు వద్దనుకుంటారు?” ఇదే విషయాన్ని భారత్ పదేపదే స్పష్టం చేస్తోంది.
స్కిల్డ్ లేబర్…
అయితే, కేవలం చమురే కాకుండా, ఇతర రంగాలలో కూడా మంచి భాగస్వామ్యం కోసం రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయని మరికొందరు నిపుణులు చెబుతున్నారు.”రష్యాలో భారతీయులకు మంచి డిమాండ్ ఉంది. సెమీ స్కిల్డ్ కార్మికుల అవసరం దేశానికి ఉంది. రష్యాకు ఐదు లక్షలమంది భారతీయ కార్మికులు కావాల్సి రావొచ్చు” అని ఆ దేశం నిపుణులు చెబుతున్నారు.
బహుళధృవ ప్రపంచం వైపు..
ఆగస్ట్ నెలాఖరులో భారత్, చైనా, రష్యా నేతలు టియాంజిన్‌లో సమావేశమైనప్పుడు, బహుళ ధ్రువ ప్రపంచం అనే అంశం ప్రత్యేకంగా ప్రస్తావనకొచ్చింది.భారతదేశం దశాబ్దాలుగా అలీన విధానాన్ని అనుసరిస్తోంది. కానీ, అంతర్జాతీయంగా దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరగడంతో అమెరికా వైపు నిలబడాలన్న ఒత్తిడి భారత్‌పై పెరిగింది.
“అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ మోడీ ప్రభుత్వం .. దేశ ప్రయోజనాలకు సంబంధించి పూర్తి స్వేచ్ఛగా వ్యవహరిస్తామని ప్రపంచానికి సందేశాన్ని పంపినట్లైంది. అంతేకాదు.. పశ్చిమదేశాలతో తన సంబంధాలను బ్యాలన్స్ చేసుకునే విషయంలో భారత్ కూడా సవాల్ ఎదుర్కొంటోంది.
రక్షణ రంగ సహకారం..
“రష్యా రక్షణ సహకారం విస్తరణపైనా దృష్టి పెట్టింది భారత్. ఆర్థిక రంగంతోపాటు ఇతర సంబంధాలను విస్తరించడానికి ప్రయత్నిస్తోంది. రష్యా అత్యాధునిక సుఖోయ్-57 యుద్ధ విమానాన్ని అందించవచ్చు. ప్రస్తుతం, చమురు దిగుమతులను భారతదేశం తగ్గిస్తున్నందువల్ల డాలర్లను సంపాదించడానికి రష్యాకు ఉన్న ఏకైక మార్గం రక్షణ రంగమే అని నిపుణులు చెబుతున్నారు.”ఎస్ -400 డిఫెన్స్ సిస్టమ్ సరఫరా, సుఖోయ్-30 అప్‌గ్రేడ్‌పై భారతదేశం ఒక ఒప్పందాన్ని ఆశిస్తోంది. దీనితో పాటు, ఆర్కిటిక్ ప్రాంతం, హిందూ మహాసముద్రంలో రెండు దేశాల మధ్య సహకారాన్ని మరింత పెంచడంపైనా ఇరుదేశాలు ఫోకస్ పెట్టాయి.






