అమెరికాలోని భారతీయులకు దారేది ?
కరోనాను నియంత్రించడంలో అన్ని దేశాలు విమాన సర్వీసులను నిలిపివేశాయి. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు వందే భారత్ మిషన్ పేరిట భారత్ ఎయిరిండియా సంస్థకు చెందిన విమానాల్ని ప్రత్యేకంగా నడుపుతున్నది. హెచ్ 1బీ వీసాతో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయులు, గ్రీన్ కార్డు కలిగిన దంపతులకు పుట్టిన పిల్లలు భారత్కు రావడానికి తాజా నిబంధనలు ఒప్పుకోవడం లేదు. దీంతో ఉద్యోగాలు కోల్పోయినవారు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు అనుమతించాలని కోరుతూ భారత దౌత్య కార్యాలయానికి విజ్ఞప్తలు చేస్తున్నారు.






