Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Usacitiesnews » Dallas » Grand success of tana psv mahilaa avadhanam

తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆద్వర్యంలో “విశిష్ట విశ్వ మహిళా అష్టావధానం” విజయవంతం

  • Published By: techteam
  • November 30, 2022 / 10:08 AM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Grand Success Of Tana Psv Mahilaa Avadhanam

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహిత్య విభాగం “తానా ప్రపంచసాహిత్యవేదిక” ఆద్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” (ప్రతి నెలా ఆఖరి ఆదివారం) లో భాగంగా  ఆదివారం, నవంబర్ 27న జరిగిన 42వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం అతి వైభవంగా జరిగింది.

Telugu Times Custom Ads

“అవధాన విద్వన్మణి” డా. బులుసు అపర్ణ అవధానిగా ఒక్కొక్క ఖండంనుండి ఒక మహిళా సాహితీవేత్త పృచ్చకురాలిగా పాల్గొన్న ఈ “విశిష్ట విశ్వ మహిళా అష్టావధానం” ప్రపంచంలోనే తొలి మహిళా అష్టావధానం గా తెలుగు సాహిత్యచరిత్రలో సరిక్రొత్త అధ్యాయం సృష్టించింది.

తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి తన స్వాగతోపన్యాసంలో ఈ నాటి ఈ సాహిత్య సభ వినూత్నము, విశిష్టమైనదని అతిథులందరకూ ఆహ్వానం పలికి సభను ప్రారంభించారు.

తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ – “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెల ఆఖరి ఆదివారం ఎన్నో వైవిధ్య భరితమైన సాహిత్య అంశాలతో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న తానా ప్రపంచసాహిత్య వేదిక మీద ఈ నాటి డా. బులుసు అపర్ణగారి అష్టావధానం తెలుగు సాహిత్యలోకంలో ఒక మహత్తరఘట్టం అని అభివర్ణించారు.    

తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహాకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ భారత దేశంనుండి మహిళా అవధాని, ప్రతి ఖండం నుండి పృచ్చకులు అందరూ మహిళలే పాల్గొన్న ఈ “విశిష్ట విశ్వ మహిళా అష్టావధానం” తెలుగు సాహిత్యచరిత్రలో మొదటిసారి అని, తానా సంస్థ సాహిత్య కిరీటంలో యిదొక కలికి తురాయి అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో తెలుగు ఉపాధ్యాయినిగా పనిచేస్తూ, ఇప్పటికే వివిధ నగరాలలో 5 శతావధానాలు, 200 కు పైగా అష్టావధానాలతో ఎంతోమంది సాహితీప్రియుల విశేష అభిమానాన్ని సంపాదించుకున్న అవధాని డా. బులుసు అపర్ణను మరియు వివిధ దేశాలనుండి పాల్గొన్న పృచ్చకురాండ్రకు తానా ప్రపంచసాహిత్యవేదిక తరపున ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ డా. తోటకూర అతిథులందరనూ క్లుప్తంగా పరిచయం చేశారు.  .               

ఈ అవధాన సంధానకర్తగా – ఉత్తరఅమెరికా ఖండం, అమెరికా, చికాగో నుండి డా. శారదాపూర్ణ శొంఠీ వేదమంత్రాలతో సభను ప్రారంభించి, ప్రతిభావంతంగా సభను సమన్వయం చేశారు.  

పృచ్చకురాండ్రుగా -: సరోజ కొమరవోలు, ఉత్తరఅమెరికా ఖండం, కెనడా దేశంనుండి – “ఆశువు”; రాధిక మంగిపూడి, ఆసియా ఖండం, సింగపూర్ దేశంనుండి – “నిషిద్ధాక్షరి”; అరవిందా రావు, ఐరోపా ఖండం,  ఇంగ్లాండ్ దేశంనుండి – “దత్తపది”; డా. శ్రీదేవి శ్రీకాంత్, దక్షిణాఫ్రికా  ఖండం, బోట్స్వానా దేశంనుండి – “అప్రస్తుత ప్రసంగం”; ఉమ దేశభొట్ల, దక్షిణఅమెరికా ఖండం, గయానా దేశంనుండి – “వర్ణన”; డా. నాగలక్ష్మి తంగిరాల, ఆస్ట్రేలియాఖండం, న్యూజిలాండ్ దేశంనుండి – “వ్యస్తాక్షరి”; డా. నిడమర్తి నిర్మలాదేవి, ఉత్తరఅమెరికా ఖండం, అమెరికా దేశం, సియాటిల్ నుండి – “సమస్య”; శారద రావి, ఆసియా ఖండం, సౌదీఅరేబియా దేశంనుండి – “వార గణనం” అనే అంశాలలో పాల్గొన్నారు.

ఆసియాఖండం, సింగపూర్ దేశంనుండి – రాధిక మంగిపూడి “నిషిద్దాక్షరి” లో ఘంటసాల పాటలవైభవాన్ని కందపద్యరూపంలో చెప్పమని కోరుతూనే తాను నిషిద్దంచేసిన అక్షరాలను తప్పుకుంటూ అవధాని అపర్ణ చేసినపూరణ.   

శ్రీ మయ గాత్రాధీరా
నీమములెల్లను గళాబ్ది నిత్య
వికార స్తోమా! మహిసుర భావా!
క్షేమ సుధల ఘంటసాల సీమల మీరున్

ఉత్తరఅమెరికా ఖండం, అమెరికా దేశంనుండి – డా. నిడమర్తి నిర్మలాదేవి ఇచ్చిన “సమస్య”      

పందిరల్లెను కృష్ణపక్షము పండువెన్నెల శోభతోన్ అన్న పాదానికి అవధాని అపర్ణ చేసిన పూరణ …
అందమౌ
రసభావనావళినద్దినట్లుగ
కావ్యమున్,
స్పందనల్ కలుగంగ జేసెడు
సర్వసుందరపేటియై,
చిందులేయగ కృష్ణశాస్త్రియె
స్నిగ్ధరంజితశబ్దమున్,
పందిరల్లెను కృష్ణపక్షము
పండువెన్నెలశోభతోన్.

ఐరోపా ఖండం, ఇంగ్లాండ్ నుండి – అరవిందారావు ఇచ్చిన “దత్తపది” అంశం లో ఉత్పలమాల లో రామాయణార్ధం వచ్చేటట్లు చెప్పమని ఇచ్చిన  

రాధ కృష్ణుడు యశోద
దేవకి అనే పదాలకు అవధాని అపర్ణ చేసిన పూరణ
“మాధవుడి ద్దరిత్రి పెనుమాయను వర్ణము నందు

కృష్ణుడా
రాధన తత్వధర్మువు పరాత్పర మూర్తియు దేవ కీర్తికై
సాధన చేసి రాముడిల సత్పథదర్శక మంత్ర వాగ్మియై
బాధను తీర్ప జేరెను ప్రభాయుత బోధన నీయ శోధనన్”

దక్షిణఅమెరికా ఖండం, గయానా దేశం నుండి – ఉమ దేశిభొట్ల కోరిన “వర్ణన” అంశం:

కోవిడ్ పుణ్యమా అని అన్నీ ఆన్లైన్లో జరిగాయి. పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు చెరోచోట ఉండగా జూంలో ధూంధాంగా జరిగిన పెళ్ళిని మీకు ఇష్టమైన పద్యరూపంలో వర్ణించండి.

అవధాని అపర్ణ పూరణ:

వరునకు కన్యకున్ మనకు
బ్రహ్మకు బందుగులెల్లవారికిన్, 
పరులకు పాకవీరులకు పందిరి
వేసిన శ్రామికాళికిన్,
తరమది కాదు చూచుటకు
తథ్యము నొండొరులెంత కోరినన్,
మర బ్రతుకయ్యె నీ కలిని
మారకయుండును మార్పు నొక్కటే

ఉత్తరఅమెరికా ఖండం, కెనడా దేశంనుండి – సరోజ కొమరవోలు “ఆశువు” అనే అంశంలో ప్రతి ఆవృత్తంలోను ఒకొక్క సందర్భంఇచ్చి ఆశువుగా పద్యాలు చెప్పమని కోరగా అవధాని అపర్ణ చెప్పిన ఆశుకవిత్వం.

సందర్భం:

ఇందిరాగాంధీ, మార్గరేట్ థాచర్లను మొల్లతో సమన్వయిస్తూ ఆశువుగా ..

పద్యం:

దేశమును నడుపు
దేశమున్న యటుల
దీక్ష బూనునట్టి దక్షతలను
మొల్ల కావ్యమందు అల్లెను నేర్పులను
నడిపె కావ్యామందు
నరుని బ్రతుకు.

సందర్భం:

ఈరోజు ఈ మహిళా అవధానం కె. విశ్వనాథ్ గారు “అవధానం” అనే పేరుతో  అమూల్యమైన సినిమా తీస్తే, అందులో మీరు కథానాయకి అయితే ..ఎలావుంటుంది?  

పద్యం:

బ్రహ్మ సృష్టిచేయ భవ్యవధానమందు
ఈ అపర్ణయందు
విశ్వనాధు లొకట
వేదిక నుండగా
విశ్వనాథ మహిమ విలసిల్లు.

సందర్భం:

జనవరి, ఫిబ్రవరి నెలల్లో కెనడాలో విపరీతంగా చలి, మంచు, ఐస్ తో జారుతూంటుంది. అది మీరు చూస్తే మీ అనుభూతి ఎట్లా ఉంటుంది?

పద్యం:

వణికించెడు చలి యొకటను
గణములు ప్రాసలు యతులును
గళమున నొకటను
గణగణ ద్వనులను
చేయగ గణుతింపదె
కెనడనన్ను ఘనమగు రీతిన్.

సందర్భం:

నాయకురాలు నాగమ్మ, రంగాజమ్మలతో ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ని పోల్చుతూ .. ఆశువు

పద్యం:

పురుష జాతికేల
పూర్ణ రంగశ్రీలు
అతివ లఘువు కాదు
అవనిలోన
నాతి పూనుకొనిన
నాయకురాలగు
ఆమె ఖ్యాతి ముందు
అణగునన్ని.

దక్షిణఅమెరికా ఖండం, న్యూజిలాండ్ దేశంనుండి – డా. తంగిరాల నాగలక్ష్మి “వ్యస్తాక్షరి” అంశంలో..

21 అక్షరాలను అడ్డదిడ్డంగా ఇస్తే వాటిని 4వ ఆవృత్తంలో అవధాని అపర్ణ చేసిన పూరణ

“మహిళావధాని మణిరత్నరంజిత శారదాంబ ఈ అపర్ణ” 

ఆసియా ఖండం, సౌదీఅరేబియా దేశంనుండి – దీపికా రావి

“వార గణనం” అంశంలో నాల్గు ఆవృత్తాలలో అడిగిన నాల్గు ప్రశ్నలు  

మే 1, 1861 ఏ రోజు అంటే –  అవధాని ‘బుధవారం’ అని,  ఏప్రిల్ 20, 1950 – ‘గురువారం’ అని, డిసెంబర్ 8, 1932 – ‘గురువారం’ అని, ఏప్రిల్ 2 , 2121 – ‘బుధవారం’ అని వెనువెంటనే సమాధానాలు చెప్పి అందరినీ ఆశ్చర్యపరచారు.  

దక్షిణాఫ్రికా ఖండం, బోట్స్వానా దేశంనుండి – అవధానికి ఆద్యంతం అంతరాయం కల్పిస్తూ డా. శ్రీ దేవి శ్రీకాంత్ “అప్రస్తుత ప్రసంగం” అనే అంశంలో    

“రాయిని రాముడు తాకితే అహల్య అయ్యింది కదా! మేముండే బోట్స్వానా వజ్రాలకు ప్రసిద్ది. శ్రీ రాముడు బోట్స్వానా వచ్చి వజ్రాలను తాకితే వజ్రం ఎవరుగా మారుతుంది?”

“ముగ్గురు మూర్తుల జూట. మూలము నెరుగుట బాట అన్నారు. ఈ ముగ్గురు ఎవరు? మూలము ఏమిటి?”

“గుర్రం, గాడిదలలో ఏది గొప్పది? మా ఆఫ్రికాలో గాడిద గొప్పదంటారు. మీకు గాడిద బహుమానంగా ఇస్తే ఏ దేశీయులకు అమ్ముతారు? ఎందుకని?”

“అత్రికి మహాపతివ్రత యైన అనసూయ ధర్మ పత్ని… మరి పత్రికి ప్రీతి పాత్రుడు ఎవరు? ఎందుకని?” అంటూ శ్రీదేవి అడిగిన చిలిపిప్రశ్నలకు అవధాని అపర్ణ తన కొంటె సమాధానాలతో సభలో నవ్వులు పూయించారు.

ఆద్యంతం ఛలోక్తులతో రసవత్తరంగా అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాలం లో జరిగిన  ఈ “విశిష్ట విశ్వ మహిళా అష్టావధానం” లో అవధాని డా. బులుసు అపర్ణ కు తానా ప్రపంచసాహిత్యవేదిక సాహిత్యాభిమానులందరి తరపున “అవధాన సరస్వతి” అనే బిరుదును ప్రదానం చేశారు. 

అవధాని డా. బులుసు అపర్ణ తన ముగింపుసందేశంలో అనేక దశాబ్దాల చరిత్రగల్గిన తానా లాంటి విశ్వవేదిక మీద అష్టావధానం చేయడం తన అదృష్టమని, ఈ అవకాశం కల్పించిన తానా సంస్థకు, పృచ్చకులకు, సాహితీప్రియులకు, ప్రసారమాధ్యమాలకు పత్యేక  కృతజ్ఞతలు అన్నారు.    

 

 

Tags
  • Dallas
  • Mahilaa Avadhanam
  • success
  • TANA PSV

Related News

  • Trump Administration Plans Significant H 1b Visa Changes

    H1B Visa: హెచ్1బీ వీసాలపై యూఎస్ ఫోకస్.. అమెరికన్లకు అన్యాయం జరిగితే ఊరుకోం!

  • Sai Mandir Ganesh Worship In Baltimore City Usa

    Ganesh Chaturthi: అమెరికాలో ఎలికాట్‌లోని సాయి మందిర్‌లో ఘనంగా గణేష్ పూజలు

  • Ap Youth Dies After Drowning In Swimming Pool In Boston

    Boston: బోస్టన్‌లో స్విమ్మింగ్ పూల్‌లో మునిగి ఏపీ యువకుడు మృతి

  • Vishwarshi Vasili Inter International Literature Conference

    Literature Seminar: విశ్వర్షి వాసిలి – అంతర్జీతీయ సాహితీ సదస్సు

  • Mind Delights A Spiritual Satsang Organized By Ata

    ATA: ఆటా నిర్వహించిన స్పిరిచువల్ సత్సంగ్ విజయవంతం

  • Ganesh Festival Celebrations In Bay Area

    Bay Area: కాలిఫోర్నియాలో 20 వేల మందితో గణేష్ చతుర్థి ఊరేగింపు

Latest News
  • Nara Lokesh: జర్మనీలో ఉద్యోగాలు పొందిన యువతకు మంత్రి లోకేష్ అభినందన
  • Ambati Rambabu: రెడ్ బుక్ బెదిరింపులకు లొంగను.. అంబటి..
  • Medical Colleges: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. ప్రభుత్వం తప్పు చేస్తోందా?
  • Mithun Reddy: ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్..
  • Ganesh Nimajjanam: నిమజ్జన ప్రక్రియను ఆకస్మికంగా పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • Khairatabad Ganesh:గంగమ్మ ఒడికి బడా గణేశ్‌ …ఘనంగా ఖైరతాబాద్‌ వినాయకుడి నిమజ్జనం
  • Modi: అమెరికాతో భాగస్వామ్యానికి మోదీ ప్రాముఖ్యత
  • Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయం లో దర్శనాలు నిలిపివేత
  • Nara Lokesh: చంద్రబాబు, వైఎస్సార్ ప్రభావం..లోకేష్, జగన్‌ల భిన్న శైలి..
  • Chandrababu: కేబినెట్‌ చేర్పులపై చంద్రబాబు క్లారిటీ..నేతలకు తప్పని వెయిటింగ్..
  • instagram

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer