బాటా నారీ 2018 సూపర్

బే ఏరియా తెలుగు అసోసియేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా సెప్టెంబర్ 22వ తేదీన నిర్వహించిన నారీ 2018 కార్యక్రమం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. మురిపించింది కూడా. ఇండియా నుంచి వచ్చిన డిజైనర్ శ్రావణ్‌కుమార్ ప్రదర్శించిన ఫ్యాషన్ షో ఎంతగానో ఆకట్టుకుంది. ఎంతోమంది చేనేత కళాకారులకు ఉపాధిని కల్పించేందుకు వారిని ఆదుకునేందుకు శ్రావణ్‌కుమార్ తన ఫ్యాషన్ షో ల ద్వారా ప్రయత్నిస్తున్నారు. ఈ షో ద్వారా కొంత నిధులను హ్యాండ్‌లూమ్ కళాకారులకోసం?సేకరించారు. మన సంస్కృతిని ప్రతిబింబించడంలో దుస్తులు కూడా ఓ ముఖ్యభాగంగా ఉన్నాయి. తనదైన డిజైన్ సంస్కృతిని, వారసత్వాన్ని దుస్తుల ద్వారా శ్రావణ్‌కుమార్ ఈ ఫ్యాషన్ షోలో ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమం కోసం అక్రిష వెడ్డింగ్, ఈవెంట్ ప్లానర్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో చేసిన అలంకరణలు అందరినీ ఆకట్టుకున్నాయి.
మెహందీ, నెయిల్ ఆర్ట్, శ్రావణ్‌కుమార్ కలెక్షన్స్ ఎగ్జిబిషన్ వంటి కార్యక్రమాలతోపాటు బిర్యానీ పాట్ అందించిన వంటలు కూడా వచ్చినవారిని మెప్పించాయి. కూచిపూడి, టాలీవుడ్ డ్యాన్స్‌లు, పాటలు, గేమ్‌షోలు నారీ షో కు వచ్చిన అతిధులను సంతోషంతో కార్యక్రమాలను తిలకించేలా చేశాయి. గొల్లభామ, బనారస్ సిల్క్‌తో వేసిన దుస్తులు, వాటికి అద్దిన మెరుపులు, డిజైన్‌లు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. తరువాత వర్క్‌షాప్‌ను నిర్వహించిన అందరి ప్రశ్నలకు సమాధానాలను శ్రావణ్‌కుమార్ ఇచ్చారు. మన చేనేత దుస్తుల కళ ఎంత గొప్పదన్న విషయాన్ని ఆయన అందరికీ వివరించారు. నేటితరాన్ని కూడా ఆకట్టుకునే విధంగా ఈ దుస్తులనుమలచుకోవచ్చని ఆయన తనడిజైన్‌ల ద్వారా నిరూపించారు. బాటా నిర్వాహకులు విజయ?ఆసూరి, శ్రీలు వెలిగేటి, శిరీష బత్తుల, శ్రీదేవి పసుపులేటి, కళ్యాణి చికోటి, స్వాతి మల్ల, దీపిక వంగాల తదితరులు ఈ షో విజయవంతానికి కృషి చేసారు.