ఉద్యోగుల భద్రతను దృష్టిలో పెట్టుకుని 2021 వరకూ వర్క్ ఫ్రమ్ హోమ్…
గూగుల్, ఫేస్బుక్ కీలక నిర్ణయం
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రముఖ దిగ్గజ కంపెనీలైన గూగుల్ మరియు ఫేస్‌బుక్‌లు కీలక నిర్ణయం తీసుకున్నాయి…ఉద్యోగులు భద్రతను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులందరికి వచ్చే ఏడాది జనవరి వరకూ వర్క్ ఫ్రం హోమ్ చేయడానికి అనుమతించాలని నిర్ణయించాయి.
గూగుల్ ఉద్యోగులు ఎవరైనా ఆఫీసులకు వెళ్లే పనిచేస్తామనే నిర్ణయం తీసుకుంటే దానికి కూడా కంపెనీ అడ్డు చెప్పలేదు… కానీ అలా ఎవరైనా వస్తారని అనుకోవట్లేదని మేనేజ్మెంట్ తెలిపింది.. గూగుల్ ఉద్యోగులు తిరిగి ఆఫీస్‌కి రావాలంటే జూన్ లేదా జులై నుంచి అనుమతించే అవకాశాలున్నాయి. అటు ఫేస్బుక్ కూడా తమ ఉద్యోగులను,వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారో అదే విధంగా ఈ సంవత్సరం మొత్తం చేసేయమని చెప్పినట్లు తెలిసింది… జూలై 6 నుండి ఫేస్బుక్ తన కార్యాలయాన్ని చాలా వరకు తెరుస్తుంది…ఇప్పుడెలాగైతే వర్క్ చేస్తున్నారో 2021 వచ్చే వరకూ వర్క్ ఫ్రమ్ హోమే బెటరని ఉద్యోగులకు సూచించింది…
వర్క్ ఫ్రమ్ హోమ్ పని చేయడానికి వీలు కల్పించే వారిలో ఎక్కువ మంది ఈ సంవత్సరం చివరి వరకు అలా చేయగలరని గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ చెప్పారు…. ఫేస్బుక్లో ప్రస్తుతం 48,268 మంది ఉద్యోగులున్నారు, 28% సంవత్సరానికి పైగా పెరుగుదల మరియు ఉద్యోగులు మార్చి నుండి ఇంటి నుండి పనిచేస్తున్నారు… సంస్థ ప్రకారం, సిబ్బంది తగ్గడం, కార్యాలయం మూసివేయడం లేదా వారు అనారోగ్యంతో ఉంటే పని చేయలేని ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కొనసాగుతుంది…






