కొన్ని రంగాలలో తప్పితే, కరోనా వలన ఎలాంటి మార్పులేదు – డా।। పైళ్ళ మల్లారెడ్డి, న్యూయార్క్
అమెరికాలో న్యూయార్క్ రాష్ట్రంలో ఫార్మాస్యూటికల్ రంగంలో పారిశ్రామిక వేత్తగా, అందరికి సహయం అందించే తెలుగు ప్రముఖులుగా పేరున్న డాక్టర్ పైళ్ళ మల్లారెడ్డి తెలుగు టైమ్స్‌తో మాట్లాడుతూ కరోనా సంక్షోభం వచ్చిన మాట నిజమే దాని, దాని వలన ప్రజల జీవనంలో ఎలాంటి మార్పు ఉండదని, ఇది తాత్కాలికం అని అన్నారు.
తాను అత్యవసర వస్తువులు తయారు చేసే రంగంలో ఉండడం వలన, తన పాక్షిక, ఆఫీసులకు కరోనా నిబంధనలు వర్తించదని, తాను ప్రతిరోజు ఆఫీసుకు వెళ్ళి వస్తున్నానని, మొదట్లో 1400 మంది ఉన్న తన ఆఫీసులలో కేవలం 10 శాతం మాత్రమే పనిలోకి వచ్చేవారని తరువాత అది 20 శాతం వచ్చిందని, ఇప్పుడు దాదాపు 90 శాతం ఉద్యోగులు రోజు పనిలోకి వస్తున్నారని తెలిపారు. తమ రంగంలోని కొందరికి కరోనా పాజిటివ్ వచ్చిందని, అయినా ఉద్యోగులు కంగారు పడకుండా ఉన్నారని, పాజిటివ్ వచిన ఉద్యోగులు కొన్నాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుని మళ్లీ నార్మల్ అయిపోయారని తెలిపారు.
ఇండియాలో మీడియా అమెరికాలోని పరిస్థితులను ముఖ్యంగా నెగటివ్ విషయాలను మాత్రమే హైలైట్ చేస్తూ ఉందని, అమెరికాలో సంక్షోభం తీవ్రంగా ఉన్నా ఇది చాలా తాత్కాలికం అని, అమెరికాలో సాధారణ పరిస్థితులు త్వరలోనే వచ్చేస్తుందని మల్లారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ వచ్చే వరకు పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఉండవని, ఇళ్ళలో కూడా పెద్ద పెద్ద వేడుకలు ఉండవని, పెళ్ళిళ్ళు, గృహ ప్రవేశాలు, పుట్టినరోజు వేడుకలు అన్నీ సింపుల్‌గా చేసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం ఉన్న నిరుద్యోగ సమస్య, ఇమ్మిగ్రేషన్ సమస్యలు కూడా తాత్కాలికమే అని, చట్టపరంగా ఉద్యోగం చెస్తున్న వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని మల్లారెడ్డి తెలిపారు. తెలుగు సంఘలు కూడా పరిస్థితులను అనుగుణంగా మార్పులు చేస్తూ కమ్యూనిటీ సేవ చేస్తున్నారని వారిని అభినిందించాల్సిందేనని అన్నారు.






