కరోనా అనుమానితులను గుర్తించేందుకు డిటెక్టివ్ లు
కొవిడ్ 19 అనుమానితులను గుర్తించేందుకు డిటెక్టివ్‌లను నియమించాలని అమెరికాలోని న్యూయార్క్ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు సదరు గూఢచారులకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం కోసం వేల మందిని నియమించనున్నారు. కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చాక మళ్లీ అది విజృంభించకుండా చూసేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ డిటెక్టివ్లకు ఆన్లైన్లో శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. కొత్తగా ఎవరికైనా కరోనా సోకితే అతడికి దగ్గరగా వెళ్లినవారిని ఈ గూఢచారులు గుర్తించాల్సి ఉంటుంది.






