బే ఏరియాలో లెజండరీ క్రికెటర్ గూగ్లి చంద్ర

నేడు క్రికెట్ అంటే ఎంత క్రేజీ ఉందో 1970వ దశకంలో కూడా క్రికెట్ ఆటను ఇష్టపడేవాళ్ళ సంఖ్య భారీగానే కనిపిస్తుంది. అలనాటి క్రికెట్ క్రీడాకారుల్లో బెస్ట్ లెగ్ స్పిన్నర్‌గా పేరు పొందిన బిఎస్ చంద్రశేఖర్ ఓ కార్యక్రమం నిమిత్తం బే ఏరియా వచ్చినప్పుడు ఆయనను పలువురు కలుసుకున్నారు. బాటా నాయకుడు ప్రసాద్ మంగిన, మరో తెలుగు ప్రముఖుడు రావు తల్లాప్రగడ తదితరులు ఆయనను కలుసుకుని నాటి క్రికెట్ వైభవాన్ని మరోమారు తలుచుకున్నారు.