ఇదే డొనాల్డ్ ట్రంప్ డెత్ క్లాక్ …
కరోనా వైరస్ తీవ్రత గురించి హెచ్చరించినప్పటికీ చెవికెక్కించుకోలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే విమర్శల పాలైన సంగతి తెలిసిందే. తాజాగా న్యూయార్క్ నగరంలోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ వేదికగా ఇలాంటి వ్యాఖ్యలే వినిపించాయి. ప్రస్తుతం ఖాళీగా ఉన్న దాని మీద ట్రంప్ డెత్ క్లాక్ పేరుతో ఒక బిల్ బోర్డు వెలిసింది. ట్రంప్ తగిన సమయంలో చర్యలు తీసుకొని ఉంటే ఆపగలిగే మరణాల సంఖ్యకు దాని మీద ప్రదర్శించారు. ఆ బిల్‌బోర్డు సృష్టికర్త న్యూయార్క్ చెందిన సినీనిర్మాత యూజీన్ జారెకి. కరోనా వైరస్ కారణంగా ఇప్పటి వరకు అమెరికాలో 80 వేలకు పైగా మరణాలు సంభవించాయి. అయితే ట్రంప్ యంత్రాంగం సరైన సమయంలో స్పందించే ఉంటే 48,000 పైగా మరణాలు అరికట్టగలిగేవాళ్లమని యూజీన్ విమర్శించారు.






