ఈ వారంలో కోటీ దాటనున్న పరీక్షలు
అమెరికాలో కొవిడ్ 19 పరీక్షల సామర్థ్యాన్ని భారీగా పెంచామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ వారంలో పరీక్షల సంఖ్య కోటీ దాటుతుందని వెల్లడించారు. ప్రస్తుతం ఎఫ్డీఏ అధీకృత 92 ప్రభుత్వ ప్రయోగశాలల్లో 90 లక్షలకు పైగా పరీక్షలు చేశారు. మూడు వారాల క్రితం రోజుకు 1,50,000గా ఉన్న టెస్టులను 300,000కు పెంచారు. అగ్రరాజ్యంలో 13 లక్షల మంది కరోనా వైరస్ సోకగా 80 వేల మంది మరణించారు. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా 40 లక్షల మందికి సోకగా 2,85,000 మంది చెందిన సంగతి తెలిసిందే. దక్షిణ కొరియా, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, స్వీడన్, ఫిన్లాండ్ మరే ఇతర దేశంతో పోల్చుకున్నా మనమే ఎక్కువ పరీక్షలు చేస్తున్నాం. ఏ రెండు దేశాలను కలిపి తీసుకున్నా మనమే ముందుంటాం అని ట్రంప్ అన్నారు.






