24 గంటల్లో భారీ సంఖ్యలో మరణాలు
ప్రపంచదేశాల్లో అమెరికా పరిస్థితి మరింత ఘోరంగా తయారయింది. ఒక్కరోజులోనే మరణాలు 1687కు పెరిగాయి. కేవలం 24 గంటల్లో మరణాలు భారీ సంఖ్యలో పెరగడంతో అధ్యక్షుడు ట్రంప్ యంత్రాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అమెరికాలో మొత్తం మరణించినవారి సంఖ్య 77,178 గా ఉన్నట్లు వెల్లడించింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య సైతం భారీగా పెరిగింది. 12,83,929 కేసులు నమోదయ్యాయి. వీరిలో చికిత్సపొందుతున్న వారిసంఖ్య 10,07,756కు చేరితే రికవరీ అయిన వారు 1,98,993 మందికి చేరారు. పాజిటివ్ కేసుల పరంగా కూడా 24 గంటల్లోనే 29,162 కేసుల వరకూ పెరిగినట్లు తేలింది. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్లు జాన్ హాప్కిన్స్ వర్సటీ వెల్లడించింది. ఆర్థిక రాజధాని న్యూయార్క్ మొత్తం విచ్ఛిన్నం అయింది. మొత్తం కేసుల్లో సగానికి పైగా న్యూజెర్సీ, న్యూయార్క్ రాష్ట్రాల్లోనే నమోదయినట్లు సర్వేలో తేలింది.






