బతుకమ్మ వేడుకల్లో భువనేష్ బుజాల

వాషింగ్టన్‌డీసీలో అమెరికా తెలుగు సంఘం (ఆటా) అధ్యక్షుడు భువనేష్ బుజాల తన ఇంట్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భువనేష్ బుజాల కుటుంబ సభ్యులతోపాటు పలువురు మహిళలు భక్తిశ్రద్ధలతో గౌరీదేవికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆటా నాయకులు పలువురు పాల్గొన్నారు.