సంప్రదాయాన్ని తెలిపిన బాటా సంక్రాంతి వేడుకలు

బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలను బే ఏరియాలోని తెలుగువాళ్ళు సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. ముగ్గుల పోటీలు, బొమ్మల కొలువు, వంటల పోటీలు, పాటల పల్లకి, గేమ్ షో, క్విజ్ పోటీలు, శాస్త్రీయ, జానపద నృత్యాలు, వంటి పసందైన కార్యక్రమాలతో బాటా సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగింది. దాదాపు 1000 మందికిపై వచ్చిన అతిధులు, ప్రేక్షులకు ఈ సంక్రాంతి కార్యక్రమం మధురమైన అనుభూతులను కలిగించింది. జనవరి 20వ తేదీన సన్నివేల్ హిందూటెంపుల్ ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకలు మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 10 వరకు సాగింది.
సంక్రాంతి వాతావరణం తలపించేలా వేదిక జరిగిన ప్రాంతాన్ని అలంకరించారు. తొలుత పాటల పల్లకితో కార్యక్రమాన్ని ప్రారంభించారు. బే ఏరియాలోని గాయనీ గాయకులు అందరికీ నచ్చేలా పాటలను పాడారు. మరోవైపు వంటల పోటీలను, రంగవల్లి పేరుతో ముగ్గుల పోటలను నిర్వహించారు. చిన్నారులకోసం ఆర్ట్ కాంపిటీషన్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలను, చెస్ పోటీలను ఏర్పాటు చేశారు. వంటల పోటీలను పెద్దలతోపాటు చిన్నారులకు కూడా ప్రత్యేకంగా నిర్వహించారు. చిన్నారులు ఇంట్లో నుంచి తీసుకువచ్చిన పదార్థాలతో స్వయంగా వంటను చేసి చూపించారు. సూపర్ చెఫ్ పేరుతో పెద్దలకోసం నిర్వహించిన పోటీల్లో పురుషులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బాటా, తెలుగు టైమ్స్ కలిసి నిర్వహిస్తున్న పాఠశాల చిన్నారులు ఈ వేడుకల్లో తెలుగు వైభవాన్ని చాటేలా నాటికలు, సంక్రాంతి థీమ్‌తో చేసిన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. బే ఏరియాలోని చిన్నారులకు తెలుగు భాషను నేర్పిస్తున్న పాఠశాల విజయవంతంగా 5 కేంద్రాల్లో దాదాపు 250 మందికిపైగా స్టూడెంట్లతో నడుస్తోంది.
ముఖ్యమైన కార్యక్రమం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైంది. బాటా సలహాదారు విజయ ఆసూరి కల్చరల్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. తొలుత చిన్నారులకు భోగిపళ్ళను పోశారు. ఈ కార్యక్రమంలో చిన్నారులతోపాటు తల్లితండ్రులు, తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. గొబ్బెమ్మల డ్యాన్స్ కూడా సంప్రదాయాన్ని గుర్తు చేసేలా జరిగింది. శివ నూపురం డ్యాన్స్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన దశావతారం శాస్త్రీయ నృత్యరూపకం అహో అనిపించింది. బాటా యువతరం సూపర్ హిట్ సాంగ్స్‌తో అలరించింది.
ఈ వేడుకలతోపాటు ఇండో అమెరికన్స్ (ఎఐఎ) ఇండియా రిపబ్లిక్ డే వేడుకలను కూడా నిర్వహించింది. అసెంబ్లీ సభ్యులు యాష్ కల్రా, కాన్సెన్ చు, కౌన్సిల్ సభ్యులు రాజ్ సల్వాన్, సవిత వైద్యనాథన్, షరీప్ లారీ స్మిత్, అసిస్టెంట్ షరీఫ్ రిక్ సంగ్, ఎఐఎ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతోపాటు బాటా చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు.
సాయంత్రం జరిగిన కార్యక్రమాల్లో బంగారు ప్రపంచం హైలైట్‌గా నిలిచింది. భారతదేశంలోని అన్నీ రాష్ట్రాల సంప్రదాయ దుస్తులతో మహిళలు చేసిన ఈ కార్యక్రమం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.
యు స్మైల్ డెంటల్ సమర్పించిన ఈ సంక్రాంతి కార్యక్రమానికి పిఎన్‌జి జ్యూవెల్లర్స్ గ్రాండ్ స్పాన్సర్‌గా, మై ట్యాక్స్ ఫైలర్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. రమణా రెడ్డి (కాల్ హోమ్స్), పాఠశాల, రియల్టర్ మను చంగోత్ర, క్లాసిక్ డైమండ్స్, రియల్టర్ లావణ్య దువ్వి కూడా స్పాన్సర్లుగా ఉన్నారు. స్వాగత్ ఇండియన్ కుజిన్, మ్యాంగోస్ ఇండియన్ కుజిన్ ఫుడ్ స్పాన్సర్‌లుగా, మీడియా పార్టనర్‌లుగా విరిజల్లు తెలుగు రేడియో వ్యవహరించింది.
బాటా ప్రెసిడెంట్ శిరీష బత్తుల మాట్లాడుతూ, ఈ వేడుకలను విజయవంతం చేసినవారందరికీ ధన్యవాదాలు తెలిపారు. బాటా టీమ్‌ను ఆమె అందరికీ పరిచయం చేశారు. యశ్వంత్ కుదరవల్లి (వైస్ ప్రెసిడెంట్), సుమంత్ పుసులూరి (సెక్రటరీ), హరినాథ్ చికోటి (ట్రెజరర్), కొండల్ రావు (జాయింట్ సెక్రటరీ), స్టీరింగ్ కమిటీ సభ్యులు రవి తిరువీధుల, కామేష్ మల్ల, కళ్యాణ్ కట్టమూరి, కల్చరల్ కమిటీ సభ్యులు శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారక దీప్తి, లాజిస్టిక్ టీమ్ సభ్యులు ప్రశాంత్ చింట, అరుణ్ రెడ్డి, వరుణ్ ముక్కలను పరిచయం చేశారు. బాటా అడ్వయిజరీ బోర్ట్ సభ్యులు జయరామ్ కోమటి, విజయ ఆసూరి, వీరు ఉప్పల, ప్రసాద్ మంగిన, కరుణ్ వెలిగేటి, రమేష్ కొండ సంక్రాంతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు బాటా టీమ్‌ను అభినందించారు.