Bawarchi: బావార్చి – డల్లాస్
డల్లాస్ (Dallas)లో రుచికరమైన బిర్యానీ(Biryani)కి కేరాఫ్‌గా బావార్చి కనిపిస్తుంది. ప్లానో కేంద్రంగా 2014లో ప్రారంభమైన బావర్చి బిర్యానీ ఉత్తర టెక్సాస్‌లో నాలుగు ప్రాంతాలకు విస్తరించింది. వివిధ రకాల భారతీయ వంటకాలను అందించే ఈ రెస్టారెంట్‌కు పేరుకు తగ్గట్టుగానే కనిపిస్తుంటుంది. సాంప్రదాయ భారతీయ మట్టి కుండలో వండిన అసలైన దమ్ బిర్యానీతో మొదట ప్రాచుర్యం పొందిన ఈ ఫ్రాంచైజీ, ఇప్పుడు భారతీయ సూప్‌లు, చాట్లు, కూరలు, సిజ్లర్లు, పానీయాలు మరియు ఇండో-చైనీస్ ఫ్యూజన్ ఆహారాన్ని కూడా తన మెనూలో చేర్చింది. డల్లాస్ ప్రాంతంలోని నాలుగు రెస్టారెంట్లు స్వతంత్రంగా నిర్వహించబడుతున్నాయి. ఆ ప్రాంతాలకుతగ్గట్టుగా ఈ రెస్టారెంట్లు మెనూను అందిస్తుంటాయి.
అమెరికాలో దాదాపు 50కిపైగా లొకేషన్లలో బావార్చి బిర్యానీ రెస్టారెంట్లు విజయవంతంగా నడుస్తున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడాలలో బావార్చి బిర్యానీ రెస్టారెంట్లు ఉన్నాయి. దాదాపుగా ప్రతి సంవత్సరం ఒక మిలియన్ మందికి తాము ఫుడ్ సర్వీస్ చేస్తున్నామని బావార్చి ఇండియన్ కుజిన్ గర్వంగా చెబుతోంది. ఈ విజయానికి తమ మిత్రులు, శ్రేయోభిలాషులు, టీమ్ సభ్యులే కారణమని అంటోంది.
కిషోర్ కంచర్ల
ఆంధ్రప్రదేశ్ లోని గుడివాడ దగ్గర రిమ్మనపూడి గ్రామానికి చెందిన కిషోర్ కంచర్ల ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు కంచర్ల పూర్ణచంద్రరావు కుమారుడు. గుడివాడలో ఎంబిఎ చదివి అమెరికాలో అడుగుపెట్టారు. సినిమా రంగం ఇష్టమైనప్పటికీ తండ్రిమాటను పాటించి సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా అమెరికాకు వచ్చారు. చిన్నప్పటి నుంచి ఆతిధ్యం, హాస్పిటాలిటీ అంటే ఎంతో ఇష్టం ఉన్న కిషోర్ కంచర్ల ఇక్కడ కూడా ఓ రెస్టారెంట్ ను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశ్యంతో బావార్చిని ఏర్పాటు చేసి మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు.
కొత్త రుచులతో సరికొత్త వంటకాలే తమ రెస్టారెంట్ విజయ రహస్యమని బావార్చి బిర్యాని రెస్టారెంట్ అధినేత కిషోర్ కంచర్ల అంటున్నారు. ఎన్నో సంవత్సరాలుగా తాము ఈ రంగంలో ఉంటూ ఎంతోమంది కస్టమర్లకు ఇంటి ఫుడ్‌ను అందిస్తున్నామని చెప్పారు. టాంటెక్స్, నాట్స్ వంటి కమ్యూనిటీ సంఘాలకు ఆతిధ్యం ఇచ్చే అవకాశం తమకు లభించిందన్నారు. కమ్యూనిటీ అవరాలకు తగ్గట్టుగా తమ రెస్టారెంట్ రుచులు ఉంటాయని చెప్పారు. కమ్యూనిటీలో మంచి గుర్తింపు ఉన్న కిషోర్ కంచర్ల ఈ రెస్టారెంట్‌కు అధినేతగా వ్యవహరిస్తున్నారు.







