ఉత్కంఠగా సాగిన ‘బాటా’ వాలీబాల్ పోటీలు

బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) నెవార్క్‌లో నిర్వహించిన 12వ వార్షిక వాలీబాల్ టోర్నమెంట్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ పోటీల నిర్వహణ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇండియా లిటరసీ ప్రాజెక్టుకు బాటా విరాళంగా ఇచ్చింది. రవి ట్యాక్స్ సర్వీసెస్, కాల్ హోమ్స్, యు స్మైల్ డెంటల్, పిఎన్‌జి జ్యూవెల్లర్స్, రియల్టర్ మను చంగోత్ర, కేంబ్రిడ్జ్ ఇన్వెస్ట్‌మెంట్స్, విటి ఫోర్స్, స్వాగత్ ఇండియన్ కుజిన్, గూగైన్, విరిజల్లు ఈ?టోర్నమెంట్‌కు స్పాన్సర్లుగా వ్యవహరించాయి. ఫుడ్ స్పాన్సర్‌గా పీకాక్ (డబ్లిన్) వ్యవహరించింది.
ఈసారి టోర్నమెంట్‌లో పలువురి కోరిక మేరకు మహిళలకు ప్రత్యేకంగా త్రోబాల్ పోటీలను, యూత్ వాలీబాల్ పోటీలను జోడించారు. పోటీలను అడ్వాన్స్‌డ్, ఇంటర్మీడియెట్, రిక్రియేషన్ గూపులుగా విభజించి నిర్వహించారు. దాదాపు 50 టీమ్‌లు ఇందులో పాల్గొన్నాయి. 300 మంది ఆటగాళ్ళు ఆడుతున్నప్పుడు ఆడియన్స్ నుంచి వాళ్ళకు మంచి ప్రోత్సాహం కూడా లభించింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోటీలు రాత్రి 7 వరకు సాగింది. కొన్ని పోటీలు ఉత్కంఠను రేకెత్తేలా సాగింది.
ఉమెన్ త్రోబాల్ పోటీల్లో విన్నర్‌గా బ్లేజర్స్, రన్నరప్‌గా ఫ్లేమ్ త్రోవర్స్, సిల్వర్ విభాగంలో విన్నర్‌గా ఈస్ట్‌బే ఛార్జర్స్, రన్నరప్‌గా చిల్లి చీటాస్, యూత్ విభాగంలో జరిగిన పోటీల్లో విన్నర్‌గా టచ్ 3, రన్నరప్‌గా టచ్ 3 శాన్‌రామన్, మెన్ రిక్రియేషన్ గ్రూపు గోల్డ్ విభాగంలో విన్నర్‌గా సన్ రైజర్స్, రన్నరప్‌గా లేజీ దాడ్స్, మెన్ సిల్వర్ విభాగంలో విన్నర్‌గా ఎస్‌విడి, రన్నరప్‌గా ఫన్ విత్ వాలీబాల్, మెన్ ఇంటర్మీడియెట్ గ్రూపు విభాగంలో విన్నర్‌గా డైమండ్ క్లబ్, రన్నరప్‌గా ఫ్రీమాంట్ ఛార్జర్స్, మెన్ అడ్వాన్స్ గ్రూపులో విన్నర్‌గా మైటీ హిట్టర్స్, రన్నరప్‌గా గూగ్లి నిలిచారు.
ఛారిటీకోసం నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో పాల్గొన్న టీమ్‌లను నిర్వాహకులు శివ్ పెపర్తి, ప్రసాద్ మంగిన అభినందించారు. బాటా ప్రెసిడెంట్ శిరీష బత్తుల మాట్లాడుతూ, బాటా ఓ సదాశయంతో నిర్వహించిన ఈ టోర్నమెంట్‌కు మంచి స్పందన లభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆమె బాటా కమిటీని అందరికీ పరిచయం చేశారు. యశ్వంత్ కుదరవల్లి (వైస్ ప్రెసిడెంట్), సుమంత్ పుసులూరి (సెక్రటరీ), హరినాథ్ చికోటి (ట్రెజరర్), కొండల్ కొమరగిరి (జాయింట్ సెక్రటరీ), స్టీరింగ్ కమిటీ సభ్యులు రవి తిరువీధుల, కామేష్ మల్ల, కళ్యాణ్ కట్టమూరి, కల్చరల్ కమిటీకి చెందిన శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారకదీప్తి, లాజిస్టిక్ టీమ్ సభ్యులు అరుణ్ రెడ్డి, ప్రశాంత్ చింత, నరేష్ గాజుల, వరుణ్, బాటా అడ్వయిజరీ టీమ్ జయరామ్ కోమటి, విజయ ఆసూరి, వీరు ఉప్పల, ప్రసాద్ మంగిన, కరుణ్ వెలిగేటి, రమేష్ కొండ ఈ టోర్నమెంట్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. టీమ్‌ను అభినందించారు.
బాటా కమిటీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసింది. ఐఎల్‌పి కో ఆర్డినేటర్స్ రాజ్ గోవింద్, కార్తీక్ కూడా బాటా ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. ఐఎల్‌పి తరపున చేస్తున్న వివిధ?ప్రాజెక్టుల గురించి వారు వివరించారు. తానా నాయకుడు సతీష్ వేమూరి, రజనీకాంత్, వినయ్‌తోపాటు ఇతర ప్రముఖులు ఈ?టోర్నమెంట్‌ను తిలకించినవారిలో ఉన్నారు.