ATA: ఆటా ఆధ్వర్యంలో ఘనంగా కుక్‌అవుట్

మాల్వెర్న్‌లోని వ్యాలీ క్రీక్ పార్క్‌లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) డెలావేర్ వ్యాలీ టీమ్ నిర్వహించిన సమ్మర్ ఫ్యామిలీ కుక్‌అవుట్ కార్యక్రమం ఘనవిజయమైంది. ఈ కార్యక్రమానికి సుమారు 600 మంది హాజరై ఉత్సాహంగా గడిపారు. ఆర్‌సి వేణు కోమటిరెడ్డి నేతృత్వంలోని అంకితభావం కలిగిన ఆటా (ATA) వాలంటీర్ల బృందం అద్భుతమైన భారతీయ ఆహారాన్ని తయారు చేసింది. సాంప్రదాయ పిల్లల క్రీడలు పెద్దలకు చిన్ననాటి సమయాన్ని గుర్తుచేయగా.. యువ తరానికి తెలుగు సంస్కృతిని పరిచయం చేశాయి.
ఈ సందర్భంగా ఆటా (ATA) బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సభ్యులు రాజు కాకర్ల మాట్లాడుతూ.. “వనభోజనాలు వంటి సంప్రదాయాలను పునరుద్ధరించడం ద్వారా, మనం మన మూలాలను పునరుజ్జీవింపజేయడమే కాకుండా, భవిష్యత్ తరాలు వాటితో అనుసంధానమై ఉండేలా చూడగలం” అని అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి కృషి చేసిన అందరికీ ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని వేణు కోమటిరెడ్డి, వేణు బండి, మహేష్ దాచెపల్లి, అరుణ్ రుద్ర, నరేందర్ ఆకుల, ప్రమోద్ సంగని, ఆనంద్ బలన్నగరి, రమణారెడ్డి, అరుణ్ మెకల, ప్రసాద్, అనిల్ కెక్కొండ, రాజేష్ కొంకీస, వంశీ యమ్జాల, సత్య పెద్దిరెడ్డితో కూడిన బృందం సమర్థవంతంగా నిర్వహించింది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీ రాజు కాకర్ల, పూర్వ అధ్యక్షులు పర్మేష్ భీమ్‌రెడ్డి కూడా ఈవెంట్‌కు అమూల్యమైన సహకారం అందించారు.