Samantha: వ్యాధితో బాధపడుతుంటే ఎగతాళి చేశారు

కొన్నేళ్ల ముందు వరకు టాలీవుడ్ లో సక్సెస్‌ఫుల్ హీరోయిన్ గా కొనసాగిన సమంత(samantha) రీసెంట్ గా ఎన్నో ఇబ్బందుల్ని, కష్టాలను ఎదుర్కొంటుంది. తన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఎన్నో విషయాలు సమంతను చాలా ఇబ్బంది పెట్టాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య(naga chaitanya) నుంచి విడిపోవడం, తర్వాత మయోసైటిస్(myositis) వ్యాధి బారిన పడటం సమంతను చాలా కృంగదీశాయి.
ఇప్పుడే వాటి నుంచి కోలుకుంటున్న సమంత తిరిగి కెరీర్లో బిజీ అవాలని ప్రయత్నిస్తోంది. కాగా సమంత రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తనపై వచ్చిన నెగిటివిటీ గురించి మాట్లాడింది. తన కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని, తనను ద్వేషించే వాళ్లు తన సిట్యుయేషన్స్ ను చూసి నవ్వారని, తాను మయోసైటిస్ తో బాధపడుతుంటే చూసి ఎగతాళి చేశారని చెప్పింది.
తన విడాకులను కూడా కొంతమంది సెలబ్రేట్ చేసుకున్నారని, వీటన్నింటినీ చూసి మొదట్లో చాలా బాధపడ్డానని, కానీ తర్వాత వాటిని పట్టించుకోవడం మానేశానని గతంలో తనపై వచ్చిన విమర్శలను ఎంతో నిజాయితీగా వెల్లడించారు సమంత. అయితే లైఫ్ లో ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా సమంత వాటిని ధైర్యంతో ఎదుర్కొని ముందుకు కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం రక్త్ బ్రహ్మాండ్(raktha brahmand) షూటింగ్ లో బిజీగా ఉన్న సమంత, త్వరలోనే తెలుగులో మా ఇంటి బంగారం(maa inti bangaram) మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనుంది.