ATA: వర్జీనియాలో ఘనంగా మదర్స్ డే వేడుకలు
అమెరికా తెలుగు సంఘం (ATA) డీసీ కాపిటల్ విభాగం ఆధ్వర్యంలో మాతృదినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. పాటలు, నృత్యాలు, ఫ్యాషన్ షో తదితర సాంస్కృతిక కార్యక్రమాలను ఈ సందర్భంగా ఏర్పాటు చేశారు. వర్జీనియా రాష్ట్ర ప్రజాప్రతినిధులు జెన్నిఫర్ బొయ్స్కో, రీసెర్, జూలీ బ్రిస్క్మం, కారి లేబెల్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఆటా అధ్యక్షుడు జయంత్ చల్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవల గురించి వివరించారు. కాన్సర్ జయించిన మహిళ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కూడా పిల్లలిని పెద్ద చేసిన తీరు ఒక మహిళ యొక్క జర్నీ ఆహుతులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.
సాంస్కృతిక కార్యక్రమాలను ఆటా మహిళా టీం సభ్యులు మంజూష నంపెల్లి, రుద్రా భీంరెడ్డి, సునీత యలము, శివాని రెడ్డి, పద్మజ బెవర, అర్చన, రమా తదితరులు పర్యవేక్షించారు. రీజినల్ కోఆర్డినేటర్స్ జీనత్ కుందూరు, పార్థ బైరెడ్డి, శేఖర్ సబ్బాని, లక్ష్మి ఈమని, ఆటా బోర్డు అఫ్ ట్రస్టీస్ విష్ణు మాధవరం, శ్రీధర్ బనాల, స్టాండిరగ్ కమిటీ చైర్స్, అడ్వైజర్స్, సభ్యులు అనిల్ బోయినపల్లి, సుధీర్ దామిది, సతీష్ వడ్డీ, రమేష్ భీంరెడ్డి, వేణు నక్షత్రం, అనిత ముత్తోజు, నర్సింహా కొప్పుల, నరేందర్ చల్ల, పవన్ గుమ్ముడల తదితరులు పాల్గొని సహకరించారు. పహల్గాం బాధితులకు, నీహాల్, సుదీక్ష కోనంకిలకు నివాళి అర్పించారు.







