Minister Narayana: అధికారులు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి నారాయణ
మొంథా తుపాను ముంచుకొస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్ల (Municipal Commissioners) తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారాయణ (Narayana) టెలీకాన్ఫరెన్స్ (Teleconference) నిర్వహించారు. చేపట్టాల్సిన చర్యలపై ఆయన పలు సూచనలు చేశారు. తుపానుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి. అన్ని మున్సిపాలిటీల్లో కంట్రోల్ రూమ్‌లు (Control rooms) ఏర్పాటు చేయాలి. ప్రజలకు ఎప్పటికప్పుడు ముందస్తు సమాచారం అందేలా చూడాలి. రోడ్ల (Roads) పై చెట్లు కూలితే వెంటనే తొలగించేలా ఏర్పాట్లు చేయాలి. పునరావాస శిబిరాల సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు అందించాలి. తాగునీటి సరఫరాకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి అని అన్నారు.







