ATA: చికాగోలో ఘనంగా ఆటా మాతృదినోత్సవ వేడుకలు
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) మే 10, 2025 శనివారంనాడు చికాగోలో అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. తల్లుల గొప్పతనాన్ని స్మరించుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో అనేకమంది తల్లులు మరియు వారి పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వేడుకలు ఉల్లాసంగా, సంతోషభరితంగా సాగాయి.
ఈ కార్యక్రమాన్ని మహిళా సమన్వయకర్తలు శిరీష వీరపనేని సాయిని నర్వాడే, సుచిత్ర రెడ్డి, సారిక రెడ్డి శెట్టి, సరిత చదలవాడ మరియు ఇతరులు కలిసికట్టుగా అత్యుత్తమంగా నిర్వహించారు. సాయిని సర్వాడే న్యూట్రిషనిస్ట్ తల్లుల ఆరోగ్యం కోసం పోషణ విలువలపై విశేషణాత్మకంగా మాట్లాడారు. అలాగే ఫిజియోథెరపిస్ట్ సరిత చదలవాడ తల్లుల సమగ్ర ఆరోగ్యంపై విలువైన విషయాలను పంచుకున్నారు. ఇద్దరు స్పీకర్లను అటా బృందం ప్రత్యేకంగా సన్మానించింది. కారక్రమంలో భాగంగా నిర్వహించిన ఆటలలో గెలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. తదనంతరం ఆటపాటలతో కార్యక్రమాలు వచ్చినవారిని అలరించాయి.
ఆటా కార్యదర్శి సాయినాథ్ బోయపల్లి, పాలకమండలి సభ్యులు వెన్ రెడ్డిరావి, ఆర్వీరెడ్డి, మహీధర్ ముస్కుల, రీజినల్ కో ఆర్డినేటర్లు పురుషోత్తం రెడ్డి, రాజ్ అడ్డగట్ల సమర్థతతోనూ, సహకారంతోనూ జరిగింది. కార్యక్రమ ఏర్పాట్లను విజయవంతంగా నిర్వహించిన మహేష్ కుమార్ చదలవాడ, లక్ష్మణ్ రెడ్డి తదితరులకు ఆటా నాయకత్వ బృందం ప్రత్యేక ధన్యవాదములను తెలియజేసింది.







