ATA: ఆటా బోర్డ్ ట్రస్టీ ఎన్నికలు…గెలిచిన విజేతలు
అమెరికా తెలుగు సంఘం (ATA) బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఎన్నికల్లో పలువురు పోటీ పడ్డారు. ఉత్కంఠభరితంగా ఈ ఎన్నికలు జరిగాయి. చివరకు విజేతలను ఆటా ప్రకటించింది. గ్రాండ్ ప్యాట్రన్ కేటగిరిలో కాశీ విశ్వనాథ్ రెడ్డి కోత, రామ్ మట్టపల్లి, శ్రీధర్ బానాల గెలిచారు. ప్యాట్రన్ కేటగిరిలో శారద సింగిరెడ్డి, రవీందర్ కె. రెడ్డి, వెన్ రెడ్డి గెలిచారు. లైఫ్ కేటగిరీలో సంతోష్ కోరం, శ్రీధర్ కంచన్కుంట్ల, శ్రీధర్ తిరుపతి, సుధీర్ బండారు, ఆర్.వి. రెడ్డి, శ్రీనివాస్ శ్రీరామ, విజయ్ కుందూర్, విజయ్ రెడ్డి తూపల్లి, విష్ణు మాధవరం గెలిచారు. ఈసారి 2025-28 పదవీ కాలానికి సంబంధించిన ట్రస్టీ ఎన్నికలు, ఫలితాలు ఉత్కంఠను కలిగించడం విశేషం. విజేతలకు తెలుగు టైమ్స్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాము.







