ATA: న్యూజెర్సిలో ఆటా బోర్డ్ సమావేశం… బాల్టిమోర్‌లో 19వ మహాసభల నిర్వహణకు ఆమోదం

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) బోర్డు సమావేశం జూన్ 28, 2025న న్యూజెర్సీ (New Jersey) లోని ఎపిఎ హోటల్ వుడ్‌బ్రిడ్జ్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల నిర్వహించిన కార్యక్రమాలు, రాబోయే ప్రాధాన్యాలపై చర్చించారు. 19వ ఆటా మహాసభలను జూలై 31 నుండి ఆగస్టు 2, 2026 వరకు బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించేందుకు బొర్డు సభ్యులు ఆమోదముద్ర వేశారు.
ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా మాట్లాడుతూ సంస్థ ఇటీవల చేపట్టిన ముఖ్య కార్యక్రమాలను వివరించారు. విద్యార్థుల కోసం విద్యా కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఐఐటీ హైదరాబాద్‌తో వ్యూహాత్మక సహకారం, అలాగే 12 యుఎస్ నగరాల్లో మదర్స్ డే మరియు మహిళా దినోత్సవ వేడుకలు విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. ఆటాడేస్, క్రీడా కార్యకలాపాలు, 5కె వాక్, యోగా సెషన్‌లు మరియు కమ్యూనిటీ క్లీన్-అప్ డ్రైవ్‌లు వంటి కార్యక్రమాల ద్వారా కమ్యూనిటీని ఆటాలో భాగస్వాములను చేశామని చెప్పారు.
కార్యదర్శి మరియు కోశాధికారి నివేదికలు: కార్యదర్శి సాయినాథ్ బోయపల్లి మరియు కోశాధికారి శ్రీకాంత్ గుడిపాటి వివిధ స్టాండిరగ్ మరియు ప్రత్యేక కమిటీల నవీకరణలతో పాటు వారి సంబంధిత నివేదికలను సమర్పించారు. ట్రెజరర్ నివేదిక ఆటా ఆర్థిక విషయాలపై పూర్తి పారదర్శకతను అందించే సంప్రదాయాన్ని ప్రదర్శించింది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రవాసుల మద్దతుతో క్లీన్ వాటర్ ప్రాజెక్ట్స్ చేపడుతున్నట్టు తెలిపారు. అగ్రిబ్రిడ్జ్ రూపొందించి ఎఐ ఆధారిత మొబైల్ యాప్ కృష్ణివాస్ ను ఈ సందర్భంగా ప్రదర్శించారు. కార్యదర్శి సాయినాథ్ బోయపల్లి, కోశాధికారి శ్రీకాంత్ గుడిపాటి నివేదికలను సమర్పించారు. ఆటా ఆర్థిక విషయాల్లో పారదర్శకతకు పెద్దపీట వేసినట్లు తెలిపారు.
ఆటా తదుపరి అధ్యక్షుడు సతీష్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 2025లో ఆటా సేవా దినోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. సంయుక్త కార్యదర్శి శారద సింగిరెడ్డి, సంయుక్త కోశాధికారి విజయ్ రెడ్డి తుప్పల్లి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నర్సి రెడ్డి గడ్డికొప్పుల, ట్రస్టీ సభ్యులు కశివిశ్వనాథ్ కోత, కిషోర్ గుదురు, మహీధర్ ముస్కుల, నర్సింహా రెడ్డి ధ్యాసాని, రఘువీర్ మారిపెడ్డి, రాజు కాకర్ల, రామ్ మట్టపల్లి, రామకృష్ణ రెడ్డి అలా, ఆర్‌వి రెడ్డి, సంతోష్ కొరాం, శ్రీధర్ కంచనకుంట్ల, శ్రీధర్ బనాల, శ్రీనివాస్ దార్గులా, సుధీర్ బండారు, వెంకట్రామ్ రెడ్డి రవి, విజయ్ కుండూర్, వినోద్ కొడురు, విష్ణు మాధవరాం తదితరులు పాల్గొన్నారు.