ATA: ఆటా ఆధ్వర్యంలో అమెరికాలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు

అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థ గత కొంతకాలంగా అమెరికాలో రక్తం కొరత ఉందని దాతలు ముందుకి వచ్చి సహకరించవలసిందిగా కోరారు. రెడ్ క్రాస్ పిలుపుకి అమెరికన్ తెలుగు అసోసియేషన్ స్పందించి స్టెర్లింగ్, వర్జీనియాలో ఆగష్టు 30వ తారీఖున బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఆటా (ATA) సంస్థ ఐనోవా సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించింది. 50 మందికి పైగా ఆటా సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసారు. రవి చల్ల, జీనత్ కుందూరు ఆటా వాషింగ్టన్ డీసీ మెట్రో ఏరియా సభ్యులు ఏరియా సభ్యులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ జయంత్ చల్ల గారు అమెరికాలో ఎన్నో నగరాలలో రక్త దాన శిబిరాలు నిర్వహిస్తున్నామని అట్లాంటాలో ఆగష్టు 9 వ తారీఖున నిర్వహించామని లాస్ ఏంజెలెస్, న్యూ జెర్సీ, డల్లాస్ మరియు నాశ్విల్లే తదితర నగరాలలో నిర్వహించనున్నామని తెలియజేసారు. ఆటా ఆధ్వర్యంలో ఇటువంటి సమాజ శ్రేయస్సు కొరకు ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందరూ సహకరంచవలసిందిగా కోరారు.