బే ఏరియాలో ఎపి జన్మభూమి మీట్ అండ్ గ్రీట్ 3న

అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్ కోమటి ఆధ్వర్యంలో బే ఏరియాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎపి గ్రామీణాభివృద్ధిశాఖ సంచాలకులు రామాంజనేయులతో ఈ కార్యక్రమం జరుగుతుంది. జూన్ 3వ తేదీన మిల్‌పిటాస్‌లోని స్వాగత్ ఇండియన్ కుజిన్ హోటల్‌లో జరిగే ఈ కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా ఎపి జన్మభూమి నిర్వాహకులు కోరారు.