క్వారంటైన్ లోకి వైట్ హౌస్ సిబ్బంది
కరోనా వైరస్‌పై పోరాటం కోసం ఏర్పాటైన శ్వేతసౌధం కార్యదళం సభ్యులు ముగ్గురు స్వీయ నిర్బంధం (క్వారంటైన్) లోకి వెళ్లారు. కొవిడ్ 19 సోకిన వ్యక్తితో కలిసి పనిచేసినందుకే మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు. అలర్జీ, అంటువ్యాధుల నివారణ జాతీయ సంస్థ డైరెక్టర్ ఆంథోనీ ఫౌచీ, వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రాల డైరెక్టర్ రాబర్డ్ రెడ్‌ఫీల్డ్, ఆహార, ఔషధ పరిపాలన విభాగం కమిషనర్ స్టీఫెన్ హాన్లు స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఫౌచీకి కరోనా పరీక్షలు నిర్వహించగా ఫలితం నెగెటివ్ అని తేలిందని అలర్జీ, అంటువ్యాధుల నివారణ జాతీయ సంస్థ సృష్టం చేసింది. ఇకపై ఆయనకు క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది.






