Upasana Kamineni : సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఉపాసన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కి ఉపాసన కామినేని (Upasana Kamineni) కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ స్పోర్ట్స్ హబ్ (Telangana Sports Hub) కు కో చైర్మన్‌గా ఉపాసనను నియమించిన విషయం తెలిసిందే. తనకు ఈ బాధ్యతను అప్పగించినందుకు సీఎంకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. క్రీడా రంగంలోనూ తెలంగాణ అభివృద్ధి సాధించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ 2025ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ ను రూపొందించింది. ఇక ఈ సంస్థకు చైర్మన్ సంజీవ్ గోయెంకా (Sanjeev Goenka)ను, కో చైర్మన్‌గా ఉపాసన కామినేనిలను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం తనకెంతో గౌరవాన్నిచ్చిందని ఉపాసన పేర్కొన్నారు. సంజీవ్ గోయెంకాతో కలిసి పనిచేసే అవకాశం రావడం మరింత గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ఒలిపింక్ సంఘం ఉపాధ్యక్షుడు వేణుగోపాలాచారి(Venugopalachari) , క్రీడలు, యువజన సర్వీసుల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.